రైల్వే కొత్త టైం టేబుల్.. నేటి నుంచే అమ‌ల్లోకి

విధాత : రైలు ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నించాల్సిన విషయం ఇది. రైళ్ల రాక‌పోక‌ల‌కు సంబంధించి కొత్త టైం టేబుల్‌ను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త టైం టేబుల్ అమ‌ల్లోకి రానుంది. ప్ర‌త్యేక రైళ్లు బాగా త‌గ్గ‌టం, రైళ్ల ఎల‌క్ట్రిఫికేష‌న్ ప‌నులు పూర్త‌వ‌డం, త‌క్కువ ర‌ద్దీ ఉండే స్టేష‌న్ల స్టాప్‌లు తొల‌గించిన నేప‌థ్యంలో రైళ్ల ప్ర‌యాణ వేళ‌ల్లో మార్పులు అనివార్యం అయ్యాయి. ఈ క్ర‌మంలో భార‌తీయ రైల్వే శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో […]

రైల్వే కొత్త టైం టేబుల్.. నేటి నుంచే అమ‌ల్లోకి

విధాత : రైలు ప్ర‌యాణికుల‌కు గ‌మ‌నించాల్సిన విషయం ఇది. రైళ్ల రాక‌పోక‌ల‌కు సంబంధించి కొత్త టైం టేబుల్‌ను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబ‌ర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త టైం టేబుల్ అమ‌ల్లోకి రానుంది. ప్ర‌త్యేక రైళ్లు బాగా త‌గ్గ‌టం, రైళ్ల ఎల‌క్ట్రిఫికేష‌న్ ప‌నులు పూర్త‌వ‌డం, త‌క్కువ ర‌ద్దీ ఉండే స్టేష‌న్ల స్టాప్‌లు తొల‌గించిన నేప‌థ్యంలో రైళ్ల ప్ర‌యాణ వేళ‌ల్లో మార్పులు అనివార్యం అయ్యాయి.

ఈ క్ర‌మంలో భార‌తీయ రైల్వే శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త టైం టేబుల్‌ను పొందుప‌రిచింది. ఇంత‌కు‌ముందు, 2021లో రైల్వే శాఖ రైళ్ల టైం టేబుల్‌ మార్చింది. ఆ టైం టేబుల్‌ కూడా గత ఏడాది అక్టో‌బర్‌ 1 నుంచే అమ‌ల్లోకి వచ్చింది. కొత్త టైం టేబుల్ కోసం www.indianrailways.gov.in అనే వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్, గ‌తిమాన్ ఎక్స్‌ప్రెస్‌, రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌, శ‌తాబ్ది, హంస‌ఫ‌ర్, తేజ‌స్, దురంతో, అంత్యోద‌య‌, గ‌రీబ్ ర‌థ్, సంప‌ర్క్ క్రాంతి, యువ‌, ఉద‌య‌, జ‌న్ శ‌తాబ్ది వంటి ఎక్స్ ప్రెస్‌ల‌తో పాటు 3,240 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌ను న‌డుపుతున్న‌ట్లు ఇండియ‌న్ రైల్వే ప్ర‌క‌టించింది. ప్యాసింజ‌ర్ రైళ్లు 3 వేలు, స‌బ‌ర్బ‌న్ రైళ్లు 5,660 ఇండియ‌న్ రైల్వేస్ నెట్‌వ‌ర్క్‌లో ప‌ని చేస్తున్నాయ‌ని తెలిపింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా ప్ర‌తి రోజు 2.23 కోట్ల మంది ప్ర‌యాణికులు రైళ్ల‌ల్లో ప్ర‌యాణిస్తున్నార‌ని వెల్ల‌డించింది. ప్ర‌యాణికుల ర‌ద్దీ దృష్ట్యా 2021-22 మ‌ధ్య కాలంలో అద‌నంగా 65 వేల‌కు పైగా ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపామ‌ని పేర్కొంది.