Site icon vidhaatha

Power Consumption: తెలంగాణలో గురువారం ఉదయానికే.. 15,497 మెగావాట్ల రికార్డు విద్యుత్ వినియోగం

విధాత: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గురువారం అత్యధిక విద్యుత్ డిమాండ్ రికార్డు నమోదయింది. ఉదయం11గంటలకే గరిష్టంగా 15,497 మెగావాట్ల డిమాండ్ నమోదయింది.

ఎండాకాలం గృహ విద్యుత్‌ వినియోగం పెరగడంతో పాటు పంటల సాగుకు, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ వాడకం పెరుగుదలతో డిమాండ్ పెరిగింది.

విద్యుత్ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలువగా మునుమందు విద్యుత్ వినియోగం మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.

Exit mobile version