Site icon vidhaatha

Renu Desai | మీరూ ఓ తల్లికి పుట్టలేదా..? పవన్‌ అభిమానిపై మండిపడ్డ రేణుదేశాయ్‌..!

Renu Desai | పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రేణు దేశాయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత విడిపోయారు. ఎవరి బతుకులు వారివిగా బతుకుతున్నారు. వీరిద్దరికి కూతురు, కొడుకు ఉన్న విషయం తెలిసిందే. పవన్‌ సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటుండగా.. రేణు దేశాయ్‌ దర్శకురాలిగా మారింది. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, పవన్‌ అభిమానులు చేసే కామెంట్లతో రేణు దేశాయ్‌ పలుసార్లు ఇబ్బందులకు గురయ్యారు. వాటిపై అప్పుడప్పుడు సీరియస్‌ అయిన సందర్భాలున్నాయి. తాజాగా అకీరానందన్‌ పుట్టిన రోజు సందర్భంగా రేణు దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టగా.. పవన్‌ అభిమానులకు, రేణు దేశాయ్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే, గతంలో కంటే భిన్నంగా కాస్త ఘాటుగానే సమాధానం ఇవ్వగా.. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాల్లోకి వెళితే.. అకీరానందర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఓ అభిమాని ‘మా అన్న కొడుకును మాకు చూడాలని ఉంటుంది. మీరు ఇలా దాచి పెట్టకండి. అప్పుడప్పుడు అయినా వీడియోలో అకీరా బాబును చూపించండి’ అంటూ కామెంట్‌ పెట్టాడు. అయితే, ఈ కామెంట్‌ రేణు దేశాయ్‌కి ఏమాత్రం నచ్చలేదు. దీనిపై ఘాటుగా స్పందిస్తూ.. ‘మీ అన్న కొడుకు ? అకీరా నా కొడుకు. మీరు ఓ తల్లికి పుట్టలేదా? మీరు ఆయనకు వీరాభిమానులు అని నేను అర్థం చేసుకుంటున్నా. పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. ఇలాంటి మెసేజ్‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం పూర్తిగా మానేశా. అయినా, మీరు మీ హ‌ద్దుల‌ను దాటుతున్నారు’ అంటూ రేణు ఘాటుగానే సమాధానం ఇచ్చారు. దీనికి పలువురు అభిమానులు స్పందించారు. ‘సాధార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో కల్చర్‌లో మీరు ఎవ‌రి అబ్బాయి అని ఎవ‌రినైనా అడిగితే తండ్రి పేరే చెబుతారు. మీరు కార‌ణం లేకుండా ఫ్యాన్స్ మీద ఫైర్ కాకండి’ మరో అభిమాని కామెంట్‌ పెట్టాడు.

దీనికి రేణు దేశాయ్‌ స్పందిస్తూ.. ‘మీరు స్త్రీ జాతిని అవ‌మానిస్తున్నారు. మ‌న సంస్కృతిలో భ‌గ‌వంతుడి కంటే గొప్ప స్థానాన్ని త‌ల్లికే ఇచ్చారు. కావాలంటే మీరు అమ్మను అడ‌గండి’ సూచించింది. అకీరా బ‌ర్త్ డే రోజున నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వ‌చ్చి నెగెటివ్ కామెంట్స్ పెట్టి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత పదకొండు సంవత్సరాల నుంచి నేను అర్థం చేసుకుంటూనే ఉన్నానని చెప్పింది. కానీ, ఓ తల్లిగా ఎప్పుడూ హర్ట్‌ అవుతున్నానని, అసలు మీకున్న సమస్య ఏంటనేది నాకు బొత్తిగా అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేణు దేశాయ్‌.

Exit mobile version