Site icon vidhaatha

TSPSC: KTR లీగల్ నోటీసుల‌కు రేవంత్ రిప్ల‌య్.. క్రిమిన‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్

విధాత: టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్‌ లీకేజీ(Paper Leakage) వ్యవహారంలో తనకు ఇచ్చిన లీగల్‌ నోటీస్‌లను ఉపసంహరించుకోకపోతే మంత్రి కేటీఆర్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని పీసీసీ(PCC) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కౌంటర్‌ ఇచ్చాడు.

ఈ మేరకు శనివారం టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ చేసిన ఆరోపణలపై లీగల్‌ నోటీస్‌ ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కు తన న్యాయవాది కుమార్‌ వైభవ్‌ ద్వారా లిఖిత పూర్వకంగా రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. లీగల్ నోటీసులోని పలు అంశాలకు రేవంత్ రెడ్డి వివరంగా సమాధానం ఇచ్చాడు.

తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్ కు సంబంధం లేదని, ఆయన ఈ దేశంలో లేనందున ఆ బాధ తెలియదన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరపున మాట్లాడానని చెప్పారు.

టీఎస్పీఎస్సీకీ సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఐటీ శాఖ అందిస్తుందని, అలాంటప్పుడు కేటీఆర్ తనకు సంబంధం లేదని ఎలా చెబుతాడని రేవంత్‌ ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి నియామకం కూడా ఐటీ శాఖ ద్వారానే జరిగిందన్నారు.

Exit mobile version