Site icon vidhaatha

ఖ‌డ్గ మృగాన్ని ఢీకొట్టిన లారీ.. వీడియో షేర్ చేసిన సీఎం

విధాత: అది క‌జిరంగా నేష‌న‌ల్ పార్క్.. ద‌ట్ట‌మైన అడ‌వి మ‌ధ్య‌లో ఓ ర‌హ‌దారి ఉంది. అయితే అప్పుడే రోడ్డుపైకి వ‌స్తున్న ఖ‌డ్గ మృగాన్ని(Rhino) వేగంగా వ‌స్తున్న ఓ లారీ ఢీకొట్టడంతో రైనో కింద ప‌డిపోగా.. లారీ అలానే వేగంగా ముందుకు వెళ్లింది. అనంతరం ఖ‌డ్గ మృగం పైకి లేచి న‌డ‌వ‌బోతుండ‌గా మ‌రోసారి కింద‌ ప‌డి ఆ త‌ర్వాత లేచి అడ‌విలోకి వెళ్లిపోయింది రైనో.

అయితే ఈ వీడియోను అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. రైనోల మా ప్ర‌త్యేక స్నేహితులని పేర్కొన్నారు. జంతువుల‌కు హానీ క‌లిగించే చ‌ర్య‌ల‌ను ఉపేక్షించ‌బోమ‌ని హెచ్చ‌రించారు. ఆ లారీ డ్రైవ‌ర్‌కు జ‌రిమానా విధించిన‌ట్లు పేర్కొన్నారు. జంతువుల‌ను కాపాడేందుకు క‌జిరంగా నేష‌న‌ల్ పార్కు సంబంధించిన 32 కిలోమీట‌ర్ల కారిడార్‌ను నిర్మిస్తున్న‌ట్లు సీఎం పేర్కొన్నారు.

Exit mobile version