Varalaxmi Sarathkumar | ఓ రాత్రి ఇద్దరిని చితకబాది.. పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది

<p>Varalaxmi Sarathkumar విధాత‌, సినిమా: వరలక్ష్మి శరత్ కుమార్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ నటుడు శరత్ కుమార్ గారాల‌ పట్టిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. సినీ కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా చేసినా.. అంతగా సక్సెస్ కాలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే తెలుగులో రవితేజ (Ravi Teja) నటించిన ‘క్రాక్’ సినిమాలో జయమ్మ (Jayamma)గా పాపులర్ కాగా.. బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ (Veerasimhareddy) చిత్రంలో లేడీ విలన్‌గా […]</p>

Varalaxmi Sarathkumar

విధాత‌, సినిమా: వరలక్ష్మి శరత్ కుమార్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ నటుడు శరత్ కుమార్ గారాల‌ పట్టిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. సినీ కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా చేసినా.. అంతగా సక్సెస్ కాలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇప్పటికే తెలుగులో రవితేజ (Ravi Teja) నటించిన ‘క్రాక్’ సినిమాలో జయమ్మ (Jayamma)గా పాపులర్ కాగా.. బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ (Veerasimhareddy) చిత్రంలో లేడీ విలన్‌గా ఆకట్టుకుంది. అయితే రియల్ లైఫ్‌లో తాను హైపర్ యాక్టివ్ అని చెప్పి ఈ ముద్దుగుమ్మ రాత్రిపూట పోలీస్ స్టేషన్‌ (Police Station) లో ఉందట. ఈ విషయమై తాజాగా ఆమె తండ్రి శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వరలక్ష్మి తాజాగా ‘కొండ్రాల్ పావమ్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ వేదికపై వరలక్ష్మిని విజయశాంతితో పోలుస్తూ కామెంట్ చేశారు కొంద‌రు అతిథులు. అయితే తండ్రి శరత్కుమార్‌ మాట్లాడుతూ మొదట్లో వరలక్ష్మీ సినిమాలోకి వస్తానంటే సినిమాలు అంత అవసరమా అని నేను అడిగాను. కానీ వరలక్ష్మి వినలేదు. సినిమాలు చేయడానికి సిద్ధమైంది. ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి తన శ్రమే కారణం. నాలాంటి తండ్రి బ్యాక్గ్రౌండ్ ఉన్న కూడా తన స్వశక్తితో పైకి ఎదిగింది.

వరలక్ష్మి చాలా ధైర్యసాహసాలు గల అమ్మాయి. ఓసారి నాకు ఒక రాత్రి సమయంలో మీ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఉందంటూ కాల్ వచ్చింది.. ఆమె ఇద్దరు అబ్బాయిలను కొట్టినట్టు తెలిసిందని వారు చెప్పారు. అయితే వారు అంతకుముందు తన కారును ఢీకొట్టడమే కాకుండా అల్లరి చేశారట. దాంతో ఆ ఇద్దరినీ వరలక్ష్మి చితకబాదింద‌ని చెప్పారు. చిన్నప్పటి నుంచి వరలక్ష్మి చాలా ధైర్య‌శాలి.. అని ఆమె తండ్రి శ‌ర‌త్ కుమార్ చెప్పుకొచ్చారు.

వరలక్ష్మీ సినీ కెరీర్ విషయానికి వస్తే.. ‘పోడా పోడి’ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. విశాల్, సింబు వంటి హీరోలతో నటించింది. కానీ ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో లేడీ విల‌న్‌గా ఆకట్టుకుని ఆశ్చర్య పరిచింది. హీరోతో సమానంగా పోటీపడి మెప్పించింది.

విశాల్ ‘పందెంకోడి 2’ సినిమాలోనూ విలన్‌గా సత్తా చాటింది. ఈ బ్యూటీ అటు తమిళంలో చేస్తూనే తెలుగులో నటిస్తోంది. సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో నెగిటివ్ రోల్‌లో అలరించింది. రవితేజ క్రాక్‌లో జయమ్మగా, అల్లరి నరేశ్‌తో కలిసి నాంది సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.