విలాసల కోసం.. అండాలను అమ్ముకుంటున్న మహిళ
Gujarat | ఆవిడ విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంది. కానీ తన భర్త సంపాదన సరిపోవడం లేదు. దీంతో అక్రమమార్గం ఎంచుకుంది. అండాలను అమ్ముకుని, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రైవాడీ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అనిత అనే మహిళకు ఐదేండ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతుల కాపురం కొన్నాళ్లపాటు సాఫీగానే సాగింది. అయితే అత్తమామలతో అనిత గొడవ పడేది. ఈ క్రమంలో వేరుగా ఉందామని భర్తతో […]

Gujarat | ఆవిడ విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంది. కానీ తన భర్త సంపాదన సరిపోవడం లేదు. దీంతో అక్రమమార్గం ఎంచుకుంది. అండాలను అమ్ముకుని, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడింది. ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రైవాడీ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అనిత అనే మహిళకు ఐదేండ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతుల కాపురం కొన్నాళ్లపాటు సాఫీగానే సాగింది. అయితే అత్తమామలతో అనిత గొడవ పడేది. ఈ క్రమంలో వేరుగా ఉందామని భర్తతో అనిత గొడవ పడేది. చేసేదేమీ లేక భర్త తన పేరెంట్స్‌కు దూరంగా, వేరే ఇంటిలో కాపురం పెట్టాడు. అక్కడ కూడా గొడవలు చోటు చేసుకోవడంతో.. అనిత తన పుట్టింటికి వెళ్లింది.
కొన్నాళ్లకు ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో.. తిరిగి భర్త వద్దకు చేరుకుంది అనిత. అయితే తన భార్య అండాలను విక్రయిస్తున్నట్లు భర్త కనుగొన్నాడు. దీనిపై ఆమె నిలదీశాడు. అవును అండాలను అమ్ముకుంటున్నాను. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించింది. ఓ ఏజెంట్‌తో పాటు తన అత్త సహకారంతో అండాలను అమ్ముకుంటున్నట్లు పసిగట్టిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. అనిత తన ఆధార్ కార్డులో వయసును కూడా తగ్గించుకున్నట్లు తేలింది. అండాలను అమ్మేందుకు భర్త అంగీకరించినట్లు ఫోర్జరీ సంతకంతో ఫేక్ సర్టిఫికెట్‌ను కూడా సృష్టించింది. దీంతో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.