Apsara Rani
విధాత: రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కరలేని ఓ సంచలనాల కుప్ప. అతను మాట్లాడితే సంచలనమే.. అతని సినిమా మీద నెట్లో డిబేట్లు పెట్టిమరీ ఏకి పారేసినా నవ్వుతూ వాటికి కౌంటర్ ఇవ్వగల సమర్థుడు. తన సిల్లీ కామెంట్స్‌తో అసలు విషయాన్ని పక్కకు నెట్టేసి, కొసరును హైలెట్ చేసి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసేరకం. అతని సినిమాలే కాదు అందులో నటించిన తారలూ పెద్ద సంచలనమైన వ్యక్తులే.
అయితే వర్మ స్కూల్ నుంచి ఐటెం గర్ల్‌గా పేరుతెచ్చుకున్న తారామణి అంకితా మహారాణా ఓ ఇలా అంటే గుర్తుపట్టడం కష్టం.. అదేనండీ అప్సర రాణి తెలుసుగా. రామ్ గోపాల్ వర్మ ఏరి కోరి పెట్టుకున్న పేరది. నార్త్ బ్యూటీ అయిన అప్సర అంతక ముందు చిన్న చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు పొందలేదు. అలాంటి టైంలో మన సంచలనాల దర్శకుడు చేరదీసి, థ్రిల్లర్ పేరుతో ఓ అడల్ట్ క్రైమ్ డ్రామా మూవీని తీసిపారేశాడు.
ఇంకేముంది అందులో అమ్మడు అప్సర బోల్డ్ సీన్స్ చేసే సరికి, ఆ అందాలకి మంచి గుర్తింపు వచ్చి రవితేజ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌కి బుక్ అయింది. అలా అప్సర తెలుగు తెరకి పరిచయమైంది. మరో విషయం ఏమిటంటే ‘క్రాక్’ మూవీలో అప్సరకు ఐటెం సాంగ్ ఇప్పించింది కూడా వర్మేనట. అలా రవితేజ సినిమాలో ఐటెం సాంగ్ చేసి, కాకపుట్టించి కిక్ ఇచ్చింది అప్సర. ఆ తర్వాత చేసిన సినిమా ‘సిటీమార్’ ఐటంలో ఎంత అందాలు ఆరబోసినా ఆ సినిమా అటకెక్కడంతో అమ్మడు పర్మినెంట్‌గా వర్మ దగ్గరే తిష్టేసింది. ఆ మధ్య అషు రెడ్డి కూడా ఇలాగే వైరల్ అయింది. ఆమె కాళ్లు నాకుతూ.. వర్మ చేసిన రచ్చ.. ఇప్పటికీ ఇండస్ట్రీ కడుక్కోలేకపోతోంది.
ఇక అప్సర విషయానికి వస్తే.. ఐటెం సాంగ్ ఆఫర్లు కూడా రాక వర్మ ఆర్జీవీ డెన్‌లో బికినీలో బోల్డ్ షూట్‍కి ఫోజులిస్తూ, ఫోటో షూట్స్ చేస్తుంది. బికినీలో అప్సర స్పోర్ట్స్ బైక్ ఎక్కి మరీ ఇచ్చిన ఫోజులు వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసాడు. ఇప్పుడవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. వర్మ చేతిలో పడ్డాక ఆ హీరోయిన్ ఇంతకంటే ఏం చేస్తుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మంచి సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు ఇంతగా దిగజారిపోవడం విషయమే అర్థం కాకుండా ఉంటే.. సినిమాల్లో నాలుగు మంచిపాత్రలు చేసుకోకుండా ఇలా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ ఏం సాధిస్తుందని అప్సరమీద కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.