Sudigali Sudheer:రష్మీకి పెద్ద షాక్ ఇచ్చిన సుధీర్.. ఏకంగా ఆమెతోనే నిశ్చితార్థం జ‌రుపుకున్నాడుగా..!

Sudigali Sudheer: బుల్లితెర‌పై క్రేజీ జంట‌గా గుర్తింపు పొందారు సుధీర్-ర‌ష్మీ. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఏ షో వ‌చ్చిన అది సూప‌ర్ హిట్టే. ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో నుంచి ఫెస్టివల్ స్పెషల్ ప్రోగ్రామ్స్ వరకు వీరు కలిసి చేసిన ప్ర‌తి కార్య‌క్ర‌మం మంచి టీఆర్పీలు రాబ‌ట్టాయి. ఈ క్ర‌మంలో రీల్ లైఫ్‌లో అద‌ర‌గొడుతున్న ఈ జంట రియ‌ల్ లైఫ్ లో కూడా అద‌ర‌గొడితే బాగుంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. సాధారణంగా ర‌ష్మీ గౌత‌మ్ సోష‌ల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా ఉంటుంది. […]

  • Publish Date - July 1, 2023 / 05:32 AM IST

Sudigali Sudheer: బుల్లితెర‌పై క్రేజీ జంట‌గా గుర్తింపు పొందారు సుధీర్-ర‌ష్మీ. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఏ షో వ‌చ్చిన అది సూప‌ర్ హిట్టే. ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో నుంచి ఫెస్టివల్ స్పెషల్ ప్రోగ్రామ్స్ వరకు వీరు కలిసి చేసిన ప్ర‌తి కార్య‌క్ర‌మం మంచి టీఆర్పీలు రాబ‌ట్టాయి. ఈ క్ర‌మంలో రీల్ లైఫ్‌లో అద‌ర‌గొడుతున్న ఈ జంట రియ‌ల్ లైఫ్ లో కూడా అద‌ర‌గొడితే బాగుంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. సాధారణంగా ర‌ష్మీ గౌత‌మ్ సోష‌ల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా ఉంటుంది. ర‌ష్మీ ఏం పోస్ట్ పెట్టిన కూడా కామెంట్ సెక్ష‌న్ లో సుధీర్ ప్ర‌స్తావ‌న త‌ప్ప‌క తీసుకు వ‌స్తారు. సుధీర్‌తో పెళ్లి ఎప్పుడు అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తుంటారు. ర‌ష్మీ ప్ర‌స్తుతం యాంక‌ర్‌గా దూసుకుపోతుండ‌గా, సుధీర్ హీరోగా త‌న అదృష్టం నిరూపించుకుంటున్నాడు.

అయితే ఈ మ‌ధ్య కాలంలో వీరిద్దరు క‌లిసి క‌నిపించిన సంద‌ర్భాలు లేవు. కాని ప‌లు సంద‌ర్భాల‌లో ర‌ష్మీకి సుధీర్ గురించి ప్ర‌శ్నలు అలానే సుధీర్‌కి ర‌ష్మీ గురించి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతూనే ఉంటాయి. ఆ మ‌ధ్య ఓ సంద‌ర్భంలో సుధీర్ మాట్లాడుతూ.. నాకు, రష్మీ గౌతమ్‌కి మధ్య ఉన్న రిలేషన్ నిజమేనా? అని ప్రశ్న‌లు అడుగుతుంటారు. వీటికి చాలా సార్లు స‌మాధానం చెప్పాను. మా ఇద్ద‌రి రిలేష‌న్ ఆన్‌స్ర్రీన్ వ‌ర‌కే ఉంటుంది. ఆఫ్ స్క్రీన్‌లో మంచి ఫ్రెండ్స్ అంతే అని అన్నాడు. తొమ్మిదేళ్ల‌కి పైగా ర‌ష్మీతో క‌లిసి ప‌ని చేశాను కాబ‌ట్టి అంద‌రు మా గురించి అలా అనుకుంటారేమో అని సుధీర్ అన్నాడు.

సుధీర్, ర‌ష్మీలు త‌మ బంధం గురించి ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చిన కూడా వారి పెళ్లికి సంబంధించి ఏదో ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. ర‌ష్మీ గౌత‌మ్‌కి సుధీర్ పెద్ద షాక్ ఇచ్చాడ‌ని, అత‌ను ఇప్పుడు త‌న మ‌ర‌ద‌లితో నిశ్చితార్థం చేసుకున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో ఓ వార్త తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. త్వ‌ర‌లో సొంత మ‌ర‌ద‌లిని వివాహం చేసుకొని ఓ ఇంటివాడు కూడా కాబోతున్నాడ‌ని చెప్పుకొస్తున్నారు. దీంతో ర‌ష్మీ- సుధీర్ వ్య‌వ‌హారం మ‌రోసారి ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Latest News