కొడుకు లిప్ లాక్ చూసి త‌ల‌దించుకున్న సుమ‌.. రాజీవ్ అలా అనేశాడేంటి!

  • By: sn    latest    Oct 11, 2023 4:10 AM IST
కొడుకు లిప్ లాక్ చూసి త‌ల‌దించుకున్న సుమ‌.. రాజీవ్ అలా అనేశాడేంటి!

యాంక‌ర్ సుమ మ‌ల‌యాళీ అయిన కూడా తెలుగు వాళ్ల‌కి చాలా ద‌గ్గ‌రైంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన ఈవెంట్ అయిన స‌రే సుమ యాంక‌రింగ్‌తో అద‌ర‌గొట్టేస్తుంది. ఇక ఆమె భ‌ర్త రాజీవ్ క‌న‌కాల న‌టుడిగా ఇండ‌స్ట్రీలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నారు. ఇప్పుడు వారి త‌న‌యుడు రోష‌న్ క‌న‌కాల హీరోగా వెండితెర ఎంట్రీ ఇస్తున్నాడు. బబుల్ గ‌మ్ అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి రవికాంత్‌ పేరెపు దర్శకత్వం వహించ‌గా, ఇటీవలే ప్రీ లుక్‌ పోస్టర్‌ విడుదల చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచిన మేక‌ర్స్ రీసెంట్‌గా నాని చేతుల మీదుగా బబుల్‌గమ్‌ టీజర్ విడుద‌ల చేశారు. ఇందులో ప్రేమ బబుల్‌ గమ్‌ లాంటిది.. మొదట్ల తీయగుంటది.. తర్వాత అంటుకుంటది.. షూస్‌ కింద, థియేటర్లల్ల సీట్ల కింద అంత ఈజీ కాదురరేయ్‌ పండవెట్టేస్తది.. అంటూ ఆస‌క్తిక‌ర డైలాగ్స్ ఉన్నాయి.


డిఫరెంట్‌ లవ్‌ట్రాక్‌తో యూత్‌కు కనెక్ట్‌ అయ్యే కథాంశంతో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే చిత్ర ప్రీ లుక్‌ పోస్టర్‌లో హీరోహీరోయిన్లు సూపర్ రొమాంటిక్ మూడ్‌లో కనిపించారు. టీజ‌ర్ చివ‌రలో కూడా రోషన్‌.. హీరోయిన్‌కి సముద్రంలో లిప్‌లాక్‌ పెట్టడం కాస్త ఓవ‌ర్ డోస్‌గా అనిపించింది. అంతేకాదు విల‌న్ కి ఓ బూతు ప‌దంతో వార్నింగ్ కూడా ఇస్తాడు. అయితే టీజ‌ర్ చూశాక రాజీవ్ క‌న‌కాల మాట్లాడుతూ.. టీజర్‌లో బాగా చేశావని, సినిమాలో కూడా బాగా చేసి ఉంటావని నమ్ముతున్నట్టుగా తెలియ‌జేశారు.


టీజ‌ర్ చివ‌రిలో లిప్ లాక్ సీన్‌పై రాజీవ్ క‌న‌కాల ఏదో మాట్లాడ‌బోతే.. పక్కనే ఉన్న సుమ కొన్ని మాట్లాడకుండా ఉంటేనే బెటర్‌ రాజా, పదా`అంటూ ఆమె సిగ్గుతో తలదించుకుని ప‌క్క‌కి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసింది. అయితే అప్పుడు రాజీవ్ క‌న‌కాల‌.. ఆడియ‌న్స్‌కి ఏమనిపించిందో అదే చెప్పాను. అవును కదా, అని అన‌డంతో పెద్ద ఎత్తున గోల చేశారు. అనంత‌రం సుమ మాట్లాడుతూ.. ఇంకా మనం ఏమేం చూడటానికి మిగిలుందో ? ఇది టీజర్‌ మాత్రమే అని చెప్పుకొచ్చింది. చిత్రానికి సురేశ్ రగుతు సినిమాటోగ్రాఫర్‌ కాగా.. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. క్షణం, కృష్ణ అండ్‌ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ రవికాంత్ పేరెపు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. డిసెంబ‌ర్ చివ‌ర‌లో మూవీని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.