Secretariat Temples | తెలంగాణ సెక్రటేరియట్‌లో.. ప్రార్థనా మందిరాలు ప్రారంభం

Secretariat Temples | పరిపాలన సౌధంలో ఆధ్యాత్మికం పరిమళం గుడి, మసీదు, చర్చిలను ప్రారంభించిన గవర్నర్‌, సీఎం లు విధాత : రాష్ట్ర పరిపాలన సౌధం సచివాలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నూతనంగా పునర్ నిర్మించిన గుడి, మసీదు, చర్చిలను ఒకేసారి గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్‌లు ప్రారంభించారు. తెలంగాణకు ప్రతికయైన గంగాజమునాతెహరీ సంస్కృతిని చాటేలా మూడు మతాల ప్రార్ధనా మందిరాల ప్రారంభోత్సవంతో సచివాలయం సమైక్యత, సమగ్రతలకు వేదికగానిలిచింది. ఆయా మతాల ప్రత్యేక పూజలు, ప్రార్ధనల […]

  • Publish Date - August 25, 2023 / 01:42 AM IST

Secretariat Temples |

  • పరిపాలన సౌధంలో ఆధ్యాత్మికం పరిమళం
  • గుడి, మసీదు, చర్చిలను ప్రారంభించిన గవర్నర్‌, సీఎం లు

విధాత : రాష్ట్ర పరిపాలన సౌధం సచివాలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నూతనంగా పునర్ నిర్మించిన గుడి, మసీదు, చర్చిలను ఒకేసారి గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్‌లు ప్రారంభించారు. తెలంగాణకు ప్రతికయైన గంగాజమునాతెహరీ సంస్కృతిని చాటేలా మూడు మతాల ప్రార్ధనా మందిరాల ప్రారంభోత్సవంతో సచివాలయం సమైక్యత, సమగ్రతలకు వేదికగానిలిచింది.

ఆయా మతాల ప్రత్యేక పూజలు, ప్రార్ధనల మధ్య వాటి ప్రారంభోత్సవం సాంప్రదాయ రీతిలో సాగింది. సచివాలయానికి నైరుతిలో నల్ల పోచమ్మ అమ్మవారితో పాటు శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలను, మసీద్‌ను, చర్చిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నిజాం నిర్మించిన తరహాలో మసీదు నిర్మాణం చేపట్టామని, ఒకే చోట గుడి, మసీద్‌, చర్చి నిర్మించుకున్నామన్నారు. ఇది చూసి భారత దేశం నేర్చుకుంటుందన్నారు. తొలిసారిగా సచివాలయానికి వచ్చిన గవర్నర్‌కు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు.

వారిద్దరూ సచివాలయం ప్రాంగణంలో ఒకే వాహనంలో ప్రయాణించి ప్రార్ధన మందిరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారితో పాటు వివిధ శాఖల మంత్రులు, అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Latest News