Warangal | ధ్వంసమైన వరంగల్ పట్టణ ప్రగతి.. నిండా మునిగిన వరంగల్ సిటీ

Warangal | సీఎం కేసీఆర్ రూ.2700 కోట్లు బాకీ ఎంపీ, ఎమ్మెల్యే భూ అక్రమణలు స్పందించకుంటే బంద్ కు పిలుపు అఖిలపక్ష సమావేశంలో నాయకుల ఆగ్రహం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా వర్షాలొస్తే నిండామునిగిపోతోందని అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం పడితే నగరం నుంచి వరద నీరు వెళ్ళిపోయే మార్గంలేకుండా పోయిందని విమర్శించారు. హనుమకొండలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ ఎం ఎల్ […]

  • Publish Date - August 16, 2023 / 12:25 PM IST

Warangal |

  • సీఎం కేసీఆర్ రూ.2700 కోట్లు బాకీ
  • ఎంపీ, ఎమ్మెల్యే భూ అక్రమణలు
  • స్పందించకుంటే బంద్ కు పిలుపు
  • అఖిలపక్ష సమావేశంలో నాయకుల ఆగ్రహం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా వర్షాలొస్తే నిండామునిగిపోతోందని అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం పడితే నగరం నుంచి వరద నీరు వెళ్ళిపోయే మార్గంలేకుండా పోయిందని విమర్శించారు. హనుమకొండలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ, టీడీపీ, బీఎస్పీ, కెయూ జాక్, డిబీఎఫ్, వైఎస్సార్ టీపీ, ఎంఐఎం, మేధావులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి భిక్షపతి, న్యూడెమోక్రసీ నాయకుడు నున్నా అప్పారావు, కన్నం సునీత, రహీమ్, చుంచు రాజేందర్,కౌటిల్ రెడ్డి,వీరస్వామి,సుభాన్ ఖాన్ తదితరులు ప్రసంగించారు. గత కొన్నిసంవత్సరాలుగా వరంగల్ నగరాన్ని ఒక పద్ధతి ప్రకారం ధ్వంసం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య వరంగల్, హన్మకొండ నగరాలు వరదల్లో కొట్టుకోపోవడమన్నారు.

ప్రజలు నీట మునిగి ఆర్ధికంగా నష్టపోయి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతుంటే బాధితులకు కనీసం నిత్యావసర సరుకులు కూడా బిఆర్ఎస్ నాయకులు పంపిణి చేయలేదన్నారు. గత ఏడాది జరిగిన వరద నష్టం యొక్క ఎక్స్ గ్రేషియా ఇంత వరకు విడుదల చేయలేదు వెంటనే ఎక్స్ గ్రేషియా విడుదల చేయాలి.వరదల వల్ల జరిగిన నష్టానికి పిలిచిన టెండర్లు పని ఇంకా మొదలు పెట్టలేదు.

అర్హులైన నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలి.డ్రైనేజిలపై అక్రమంగా కడుతున్న కట్టడాలపై చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. వరదల వలన ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇంతవరకు ఎక్స్ గ్రేషియా అందచేయలేదన్నారు. వరద నీరు బయటపోయే విధంగా ఏర్పాట్లు చేయాలి. లేని యెడల నగరం మొత్తం వరద నీరుతో మునిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వరంగల్ నగరానికి సీఎం రూ. 2700 కోట్లు బాకీ

సీఎం కే.సి.ఆర్ నగారాభివృద్ధికి యేటా రూ.300 కోట్ల ఇస్తానని వాగ్దానం చేసారు.ఆ లెక్కన ఈ తొమ్మిది ఏండ్లలో 2700 కోట్లు బాకీ అయినాడు. వరంగల్ కు వస్తే అవి ఇచ్చిన తర్వాతనే మాట్లాడాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు నగరం చుట్టుపక్కల భూములను ఆక్రమించుకొని వెంచర్లు చేసి నగరాన్ని ముంచుతున్నారన్నారు. నగరాభివృద్ధి పట్టించుకోకుంటే అందరిని కలుపుకొని ఈ నెల 25 లోపు బంద్ కు పిలుపు నిస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో నమిండ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, కే.యు ప్రొఫెసర్ శేషు, సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి,సోమ రామూర్తి, బిసి ఉద్యమ నేత సాయిని నరేందర్, తిరుపతి యాదవ్, పిట్టల శ్రీనివాస్, డాక్టర్ కే. వీరస్వామి, కే. శివాజీ, ఎస్.కే. బాబా ఖాదర్ అలీ, కే. జయశంకర్, ఎం. మనోహర్ , సయ్యద్ ఫజిఉల్లా, మిర్జా అజీజుల్లా బేగ్, ఎన్. హరీష్, సి,హెచ్ కుమారస్వామి, విజయ్ ఖన్న, సాయిరెడ్డి, బి. నరేష్, కన్నం సునీల్, డాక్టర్ శంకర్ వేల్పుల, కే. సాయి రెడ్డి, ఆర్.రమేష్ దేవా, వెంకట్ రెడ్డి, ప్రేం సుందర్ , పుట్ట రవి, ఎం. శ్యాం సుందర్, తదితరులు పాల్గొన్నారు.

Latest News