ఈ హీరోయిన్‌ సైడ్‌ ఇన్‌కం బాగానే ఉందే!

విధాత: నందమూరి నటసింహ బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నటించిన మలయాళ భామ హ‌నీ రోజ్‌కు ఇక్కడ సూపర్ క్రేజ్ సంపాదించింది. అప్పుడెప్పుడో అమ్మడు శివాజీ ‘ఆలయం’ సినిమాలో తెలుగు తెర‌కు పరిచయమై ఆ త‌ర్వాత ‘ఈ వ‌ర్షం సాక్షిగా’ అనే చిత్రంలో కూడా న‌టించింది. వీరసింహారెడ్డి చిత్రంతో మంచి ఐడెంటిటీ సాధించింది. ఇప్పుడామెకు తెలుగులో వ‌రుస‌ అవకాశాలు వస్తున్నాయి. బాలయ్య నెక్స్ట్ సినిమాలో కూడా హనిరోజ్‌కు చాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సినిమాల సంగతి ఇలా […]

  • By: krs    latest    Feb 24, 2023 2:34 PM IST
ఈ హీరోయిన్‌ సైడ్‌ ఇన్‌కం బాగానే ఉందే!

విధాత: నందమూరి నటసింహ బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నటించిన మలయాళ భామ హ‌నీ రోజ్‌కు ఇక్కడ సూపర్ క్రేజ్ సంపాదించింది. అప్పుడెప్పుడో అమ్మడు శివాజీ ‘ఆలయం’ సినిమాలో తెలుగు తెర‌కు పరిచయమై ఆ త‌ర్వాత ‘ఈ వ‌ర్షం సాక్షిగా’ అనే చిత్రంలో కూడా న‌టించింది. వీరసింహారెడ్డి చిత్రంతో మంచి ఐడెంటిటీ సాధించింది. ఇప్పుడామెకు తెలుగులో వ‌రుస‌ అవకాశాలు వస్తున్నాయి.

బాలయ్య నెక్స్ట్ సినిమాలో కూడా హనిరోజ్‌కు చాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సినిమాల సంగతి ఇలా ఉంటే.. సినిమాల కంటే ఎక్కువగా ఆమెకు షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్లు వస్తుండటం విశేషం. కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్లకి సైడ్ ఇన్కమ్‌గా షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో హనీరోజ్‌కి కూడా అలాంటి అవకాశాలే వస్తున్నాయి.

ఇప్పటికే అమ్మడు ఒకటి రెండు చోట్ల షాపింగ్ మాల్ ఓపెనింగ్స్‌లో పాల్గొంది. తాజాగా ఖమ్మంలోని ముగ్డా షోరూం ఓపెనింగ్‌కి అటెండ్ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్ర‌మంలో పాల్గొన్నందుకు హ‌నీరోజ్‌కు షాపింగ్ మాల్ అధినేత‌లు భారీ మొత్తాన్నే ఇచ్చిన‌ట్లు స‌మాచారం. హీరోయిన్ల‌కు ఇలాంటి ఆఫ‌ర్స్ బాగా అల‌వాటే. బాలయ్య సినిమాతో వచ్చిన క్రేజ్‌కి.. ఇప్పుడొస్తున్న ఆఫర్స్‌కి ఆమె చాలా హ్యాపీగా ఫీలవుతోందట.

మలయాళం‌లో మంచి క్రేజ్ ఉన్నా తెలుగులో ఈ భామకి ఇప్పుడు సరికొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అందుకు మరో కారణం కూడా ఉంది. తన ఫిగర్‌ని ఎప్పటికప్పుడు ఎక్స్‌పోజ్ చేస్తూ.. సోషల్ మీడియాలో హీట్ పుట్టించడం కూడా ఆమె క్రేజ్‌కు మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ క్రేజ్‌ను ఈ అమ్మ‌డు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంది.

వీర సింహారెడ్డి లాంటి మరో సినిమా తెలుగులో పడితే అమ్మడు ఇక్కడ సెటిల్ అయినట్టే. ఇప్పటికే బాలయ్య దృష్టిలో పడిన హనీ.. ఆయనతోనే మరో రెండు సినిమాల్లో నటించే అవకాశం ఉన్నట్టు కూడా టాక్ నడుస్తోంది. ఇక మిగతా హీరోలు కూడా హ‌నీ వైపు దృష్టి పెడితే ఈ అమ్మడు టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోయే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.