మునుగోడు ఎన్నికల అభ్యర్థుల ఖర్చు ఇంతేనా..!
ఈసీని ప్రశ్నించిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఖర్చుల వివరాలు ఇచ్చిన నల్గొండ కలెక్టర్ మన రాజకీయాలు ఏలా ఉంటాయంటే నాయకులు చెప్పేది ఒకటి, అధికారుల రికార్డుల్లో ఉండేది మరొకటి.. దేశంలో కాని, రాష్ట్రంలో కాని ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే మాత్రం అక్కడ డబ్బుల వర్షమే కురుస్తోంది. ప్రచారానికి వందలాది వాహనాలు, ఏరులై పారే మద్యం, అడ్డు, అదుపులేకుండా ఖర్చు చేస్తారు. ఇష్టానుసారంగా ఖర్చు చేసే డబ్బంతా ఎక్కడిదంటే మళ్లీ ప్రజలదే. అదే విషయాన్ని ప్రజలు […]

- ఈసీని ప్రశ్నించిన యూత్ ఫర్ యాంటీ కరప్షన్
- ఖర్చుల వివరాలు ఇచ్చిన నల్గొండ కలెక్టర్
మన రాజకీయాలు ఏలా ఉంటాయంటే నాయకులు చెప్పేది ఒకటి, అధికారుల రికార్డుల్లో ఉండేది మరొకటి.. దేశంలో కాని, రాష్ట్రంలో కాని ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే మాత్రం అక్కడ డబ్బుల వర్షమే కురుస్తోంది. ప్రచారానికి వందలాది వాహనాలు, ఏరులై పారే మద్యం, అడ్డు, అదుపులేకుండా ఖర్చు చేస్తారు. ఇష్టానుసారంగా ఖర్చు చేసే డబ్బంతా ఎక్కడిదంటే మళ్లీ ప్రజలదే. అదే విషయాన్ని ప్రజలు మాత్రం తెలుసుకోలేకపోతారు.
విధాత, హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నిక జాతీయస్థాయిలో పేరుపోయింది. ఎందుకంటే ఇక్కడి ఉప ఎన్నికను ప్రధాన పార్టీలైనా బీజేసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు ఏలాగైనా సాధించాలని ఎవరి అంచనాలకు మించకుండా మరొకరు కోట్లాది రూపాయలను కుమ్మరించారు.
ఏ పార్టీ ప్రచారానికి వెళ్లిన, చివరికి బోనాలు తయారుచేసిన మహిళలకు సైతం ఎంతో కొంత ముట్ట చెప్పారని అక్కడి మహిళలే చెప్పారు. పోలింగ్ రోజు మాత్రం కొన్ని ప్రాంతాల్లో తమకు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామనే ప్రజలు ఉన్నారు. అలాంటిది ఒక్కొ పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయని విషయం రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా అందరికి తెలిసిన విషయమే.
ఇదే విషయంపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ ఎన్నికల అధికారిని మునుగోడు ఎన్నికల్లో ఏఏ పార్టీ నాయకులు ఎంత ఖర్చు పెట్టారో వారి పూర్తి వివరాలు తెలపాలని సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించింది. ఆ సహచట్టం దరఖాస్తును నల్గొండ జిల్లా కలెక్టర్ కు ఫార్వర్డ్ చేయగా నల్గొండ జిల్లా కలెక్టర్ మునుగోడు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలను అందించగా వాటిని యూత్ ఫర్ యాంటీకరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి బయటపెట్టారు.
మునుగోడు ఉప ఎన్నికల బరిలో మొత్తం 47మంది అభ్యర్థులు పోటి చేశారు. అందులో నాలుగు పార్టీలే ఉప ఎన్నికల ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారని వారు ఇచ్చిన సమాచారంలో ఉంది.
BRS కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారం ఖర్చు = 26లక్షల,12వేల 471
BJP కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం ఖర్చు = 34లక్షల 75వేల 758
కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి ప్రచారం ఖర్చు = 28లక్షల 96వేల 334
BSP అభ్యర్థి అందోజు శంకరాచారి చేసిన ప్రచారం ఖర్చు = 13లక్షల 11వేల 500
ఇండిపెండెంట్ KA పాల్ ప్రచారం ఖర్చు = 6లక్షల 79వేల 292
మిగతా అభ్యర్థుల ఖర్చు లక్ష రూపాయల లోపు ఉందని వారు తెలిపారు. అక్కడ జరిగిన ప్రచారం, హంగు, ఆర్భాటాలకు చేసిన ఖర్చు లెక్కల్లో ఉందని దేశమంతా అంటుంటే, ఎన్నికల అధికారి ఇచ్చిన లెక్కలు మాత్రం అభ్యర్థుల ఖర్చు అరకొటి కూడా దాటలేదు.