Site icon vidhaatha

Tamannaah, Vijay Varma: త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ.. విడిపోయింది ఇందుకా?

ఇటీవ‌ల త‌మ‌న్నా, ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌ల మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది వారిరివురు బ్రేక‌ప్ చెప్పుకున్నారు అంటూ వార్త‌లు తెగ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ జంట విడిపోవడానికి కారణాలివే అంటూ ఈ మ‌ధ్య‌ సోషల్ మీడియాలో కొన్ని న్యూస్‌ వైరల్ అవుతున్నాయి. గతంలో డేటింగ్‌లో ఉన్నామంటూ ప్ర‌క‌టించి హాడావుడి చేసిన‌ ఈ జంట ఉన్న‌ఫ‌లంగా బ్రేకప్ చెప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హిందీలో ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌లో విజయవర్మతో తమన్నా కలిసి నటించింది. అంతేకాదు అప్ప‌టివ‌ర‌కు ముద్దు సీన్ల‌కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సిరీస్‌లో విజ‌య్ వ‌ర్మ‌తో రెచ్చిపోయి మ‌రి కిస్ సీన్ల‌లో న‌టించి మ‌రి ఔరా అనిపించింది. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అది కాస్త డేటింగ్ వరకు వెళ్ళింది. ఇద్దరు చట్టపట్టాలేసుకొని తిరుగుతూ అందరి కంట్లో పడ్డారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే మొదట్లో తాము ఫ్రెండ్స్ అని, తమ మధ్య ఎలాంటి బంధం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఆ తర్వాత విజయ్ వర్మ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తమన్నా ద‌ర్శ‌ణ‌మిచ్చి మ‌రోసారి మీడియా కంట్లో ప‌డ‌డంతో చివ‌ర‌కు ఇద్దరం లవ్‌లో ఉన్న‌ట్లు క‌న్ఫ‌మ్ చేయ‌డంతో పాటు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని వెల్లడించారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా పాల్గొని ఇప్పట్లో తాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. విజయ్ వర్మతో తమన్నా పెళ్లి పీటలు ఎక్కుతుందని అందరూ భావిస్తున్న టైమ్‌లోనే పెళ్లి చేసుకోవాలనుకునే ఆలోచనే లేదని చెప్పి షాకిచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ జంట బ్రేకప్ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇద్దరు ప్రేమికులుగా విడిపోయిన స్నేహితులుగా ఉండాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఇలా కలిసి ఉండటానికి గల కారణం ఏమై ఉంటుందా అని అందరూ అనుకుంటున్నారు. అయితే కెరీర్‌, పెళ్లి విషయంలో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలుస్తుంది. తమన్నా పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని అనుకుందట. అయితే విజయ్ వర్మ మాత్రం కొంత టైం కావాలని కోరినట్టు తెలుస్తుంది. విజయ్ వర్మ కెరీర్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని అంటున్నారు. అందుకే విడిపోయి స్నేహితుల ఉండాలని అనుకున్నారని మాట్లాడుకుంటున్నారు.

ఇక మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి మంచు మనోజ్ ‘శ్రీ’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో టాప్ హీరోలు అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత హ్యాపీడేస్‌, బాహుబ‌లి, ర‌చ్చ‌, రెబ‌ల్ సినిమాలు అమె కెరీర్‌లో పెద్ద చిత్రాలుగా మిగిలాయి. ఇటీవ‌ల టాలీవుడ్‌లో అంత‌గా సినిమాల్లో క‌నిపించ‌ని ఈభామ బాలీవుడ్‌లో ప్ర‌త్యేక గీతాల్లో న‌టిస్తూ త‌న అందాల‌తో కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్ర‌స్తుతం తెలుగులో ఓదెల‌2 అనే సినిమాలో లేడి అఘోరిగా న‌టిస్తోంది. ఇదిలాఉండ‌గా విజ‌య్ వ‌ర్మ తెలుగువారికి సుప‌రిచిత‌మే. అంతేకాదు ప‌క్కా హైద‌రాబాదీ అయిన విజ‌య్ ఐదేండ్ల క్రితం నాని ఎంసీఎ సినిమాలో విల‌న్‌గా న‌టించి మెప్పించాడు. ఆపై బాలీవుడ్‌లోనే పూర్తిగా సెటిలై బిజియెస్ట్ , కాస్టిలీయెస్ట్ న‌టుడిగా ఎదిగాడు.

Exit mobile version