విధాత: ఈ వారం కూడా థియేటర్లలో ఆర డజన్‌కు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో నందమూరి కల్యాణ్ రామ్ ప్రయోగాత్మకంగా చేసిన అమిగోస్, అవికాగోర్,సాయు రోనక్ నటించిన పాప్‌కార్న్, బాబీ సింహ నటించిన వసంతకోకిల, బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ చాలాకాలం తర్వాత నటించిన బ్రేకౌట్ చెప్పుకోదగినవి మిగతావన్నీ స్మాల్ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక ఓటీటీల్లో ఈ వారం పెద్ద సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ముందుగా తమిళ స్టార్ అజిత్ నటించిన తునీవు(తెగింపు), విజయ్ సేతుపతి, షాహీద్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ఫార్జీ, వారం క్రితం థియేటర్లలో విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచిన సుధీర్‌బాబు నటించిన హంట్ చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.