Site icon vidhaatha

శివ‌లింగాన్ని హ‌త్తుకున్న తాబేలు.. ఆనందంలో భ‌క్తులు

Shivalingam | శివ‌లింగం వ‌ద్ద నాగుపాము ప్ర‌త్య‌క్ష‌మైన ఘ‌ట‌న‌ల‌ను చూశాం. శివ‌లింగం చుట్టూ చుట్టుకొని నాగుపాము నాట్య‌మాడిన దృశ్యాల‌ను చూశాం. తాజాగా ఓ తాబేలు శివ‌లింగాన్ని హ‌త్తుకుంది. ఈ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

గుజ‌రాత్ జునాగ‌ఢ్ జిల్లాలోని భావ్‌నాథ్ ఆల‌యంలో శివ‌లింగాన్ని తాబేలు హ‌త్తుకున్న దృశ్యం క‌నిపించింది. ఆల‌యంలోకి ప్ర‌వేశించిన ఓ భారీ తాబేలు.. నేరుగా శివలింగం వ‌ద్ద‌కు వెళ్లింది. అనంత‌రం ఆ శివ‌లింగాన్ని హ‌త్తుకుని అక్క‌డే ఉండిపోయింది.

అయితే ఈ దృశ్యాల‌ను అక్క‌డున్న ఓ భ‌క్తులు త‌న కెమెరాలో బంధించి వైర‌ల్ చేశారు. తాబేలు శివ‌లింగాన్ని హ‌త్తుకోవ‌డం ప‌ట్ల ప‌లువురు భ‌క్తులు ఆనందం వ్య‌క్తం చేశారు. మ‌రికొంత మంది భ‌క్తులేమో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

Exit mobile version