Traffic Challan | ఇదేందయ్య ఇదీ..! హెల్మెట్‌ లేకుండా కారు నడిపిందని..! మహిళకు రూ.1000 ఛలానా పంపిన పోలీసులు..!

Traffic Challan | హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధించడం సాధారణ విషయమే. కానీ, ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. హెల్మెట్‌ లేకుండా కారు నడిపినందుకు పోలీసులు రూ.వెయ్యి చలానా పంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ గ్రేటర్‌ నోయిడాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని హోషియాపూర్‌ ప్రాంతంలో హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపినందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు శైలజా చౌదరికి ఈ నెల 27న గౌతమ్‌ బుద్ధనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ.1000 ఈ […]

Traffic Challan | ఇదేందయ్య ఇదీ..! హెల్మెట్‌ లేకుండా కారు నడిపిందని..! మహిళకు రూ.1000 ఛలానా పంపిన పోలీసులు..!

Traffic Challan |

హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధించడం సాధారణ విషయమే. కానీ, ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. హెల్మెట్‌ లేకుండా కారు నడిపినందుకు పోలీసులు రూ.వెయ్యి చలానా పంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ గ్రేటర్‌ నోయిడాలో చోటు చేసుకున్నది.

వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని హోషియాపూర్‌ ప్రాంతంలో హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపినందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు శైలజా చౌదరికి ఈ నెల 27న గౌతమ్‌ బుద్ధనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు రూ.1000 ఈ చలాన్‌ పంపారు.

ఇందులో విశేషం ఏంటంటే.. ఆమె పేరుపై ఎలాంటి ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్‌ కాలేదు. వివరాల్లోకి వెళితే.. పోలీసులు జారీ చేసిన చలాన్‌లో ఆమె కారు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ మాత్రం నమోదైంది ఉంది. చలాన్‌లో మాత్రం బైక్‌ ఫోటో కనిపించింది.

హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపినందుకు జరిమానా విధించినట్లు ఈ చలాన్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శైలజా చౌదరి మాట్లాడుతూ.. ‘నా మొబైల్‌కు ట్రాఫిక్‌ పోలీసుల నుంచి మెస్సేజ్‌ వచ్చింది. కానీ, మొదట నేను మా ఇంటికి వచ్చిన బంధువు నా కారును నడుపుతూ ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించారని అనుకున్నా.

కానీ, మెస్సేజ్‌ ఓ పెన్‌ చేసి చూస్తే జూన్‌ 27న ఉదయం 8.29 గంటలకు హెల్మెట్‌ లేకుండా ప్రయాణించినందుకు చలాన్‌తో పాటు బైక్‌ ఫోటోను పంపారు. నా కారు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ అందులో ఉండడం చూసి నేను షాక్‌కు గురయ్యాను’ అను పేర్కొన్నారు. తన పేరు మీద హ్యుందాయ్‌ ఐ20 కారు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసి ఉందని.. ఎలాంటి ద్విచక్ర వాహనం లేదని ఆమె స్పష్టం చేశారు.

ట్రాఫిక్‌ పోలీసులు పొరపాటుగా చలాన్‌ జారీ చేసి ఉంటారని భావిస్తున్నానని.. దాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తాని చేయని నేరానికి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. దీనిపై ట్రాఫిక్‌ డిప్యూటీ కమిషనర్‌ ప్రీతి యాదవ్‌ స్పందించారు.

కొన్నిసార్లు ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ITMS) రిజిస్ట్రేషన్ నంబర్‌ను తప్పుగా నమోదు చేస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ఫిర్యాదులు ఏమైనా ఉంటే మెయిల్, లేదంటే కార్యాలయంలోనైనా సంప్రదించచ్చన్నారు.