Trisha | విధాత: కొంతమంది హీరోయిన్లు వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో అందరినీ ఆకట్టుకుం టూనే ఉంటారు. అలాంటి వారిలో త్రిష కూడా ఒకరు. 40 పదుల వయసులో కూడా తన అందం, అభినయంతో ఎవర్ గ్రీన్ హీరోయిన్గా ప్రేక్షకుల మతులు పోగొడుతూ ఉంది. తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, సిద్దార్ధ, మహేష్ బాబు వంటి హీరోలతో నటించిన త్రిష.. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ పలు సినిమాలతో అందరినీ ఆకట్టుకుంది. టాప్ హీరోయిన్గా చాలా కాలం […]
Trisha |
విధాత: కొంతమంది హీరోయిన్లు వయసు పెరుగుతున్నా వన్నె తగ్గని అందంతో అందరినీ ఆకట్టుకుం టూనే ఉంటారు. అలాంటి వారిలో త్రిష కూడా ఒకరు. 40 పదుల వయసులో కూడా తన అందం, అభినయంతో ఎవర్ గ్రీన్ హీరోయిన్గా ప్రేక్షకుల మతులు పోగొడుతూ ఉంది. తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, సిద్దార్ధ, మహేష్ బాబు వంటి హీరోలతో నటించిన త్రిష.. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ పలు సినిమాలతో అందరినీ ఆకట్టుకుంది.
టాప్ హీరోయిన్గా చాలా కాలం చలామణీ అయింది. ఆ తర్వాత పెళ్లి అంటూ కాస్త హడావుడి చేసినప్పటికీ.. పెళ్లి పీటల వరకు వెళ్లి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకుంది. అందుకు కారణాలు ఏంటనేది పక్కన పెడితే.. మళ్లీ కమ్ బ్యాక్ అయిన త్రిష ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్న వారికీ కూడా గట్టి పోటీ ఇస్తూ మళ్లీ తన అందంతో అందరినీ కట్టిపడేస్తుంది.
ఇటీవల వచ్చిన మణిరత్నం కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’లో క్యూట్ కనిపించి అందరి మతులను పోగొట్టింది. ఏమా అందం.. అస్సలు కుర్ర హీరోయిన్లు ఏం సరిపోతారు అన్నట్లుగా తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయంటే.. ఆమె పరువాల పవర్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు.
ప్రస్తుతం కోలీవుడ్ హీరో విజయ్ ‘లియో’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న త్రిష.. త్వరలో మెగాస్టార్ చిరంజీవి చిత్రంతో టాలీవుడ్‌లోనూ తన రీ ఎంట్రీకి మార్గం వేసుకుంటుంది. ప్రస్తుతం బాలయ్య, నాగ్, వెంకీ వంటి సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఎలా ఉందో తెలియంది కాదు.
త్రిష కనుక మళ్లీ టాలీవుడ్‌కి వస్తే.. వాళ్లంతా కళ్లకి అద్దుకుంటారు. త్వరలో చిరంజీవి హీరోగా మలయాళ చిత్రం ‘బ్రో డాడీ’ రీమేక్ కానుంది. ఈ సినిమాలో త్రిషని యాక్ట్ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు చిరంజీవి ‘స్టాలిన్’ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది.
ఇక చిరంజీవి సినిమా అలా ఉంటే మలయాళంలో టోవినో థామస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీలో కూడా త్రిష అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయినట్లుగా మేకర్స్ ప్రకటించారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంతో త్రిష మరోసారి పాన్ ఇండియాను టచ్ చేస్తుండటం చూస్తుంటే.. మళ్లీ ఓ రేంజ్ త్రిష ఊపేయడం కాయం అన్నట్లుగా ఫ్యూచర్ కనబడుతోంది. అన్నట్లు త్వరలో బాలయ్య హీరోగా ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ తెరకెక్కించనున్న సినిమాలో కూడా త్రిషని తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంట. మొత్తంగా చూస్తే.. త్రిష టైమ్ మరోసారి స్టార్ అయిందని చెప్పక తప్పదు.