Site icon vidhaatha

World Cup | టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో జైషా భేటీ..! ఐసీసీ మెగా టోర్నీలపై కీలక చర్చలు..!

World Cup | భారత జట్టు 2013 నుంచి ఐసీసీ ట్రోఫీని గెలువలేకపోయింది. రెండు వన్డే ప్రపంచ కప్‌లు, నాలుగు టీ20 వరల్డ్‌ కప్‌లు, రెండు ఐసీసీ టెస్ట్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లు జరుగ్గా.. ఇందులో టీమిండియా నిరాశపరిచింది. ఈ ఏడాది భారత్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వబోతున్నది. అక్టోబర్‌ – నవంబర్‌ మధ్య మెగాటోర్నీ జరుగనున్నది. స్వదేశంలో జరిగే టోర్నీని భారత జట్టు గెలుపొందుతుందని భావిస్తున్నారు. మెగా టోర్నీ కోసం భారత ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. అదే సమయంలో భారత్‌ వెలుపల జరిగే టోర్నీల కోసం సైతం ప్రణాళికలను సైతం రూపొందిస్తున్నది. ఈ క్రమంలో బీసీసీఐ సెక్రెటరీ జైషా, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మధ్య సుధీర్ఘంగా చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసియా కప్‌తో పాటు ప్రపంచకప్‌కు సంబంధించి ఇద్దరు సుదీర్ఘ సంభాషణ ఫ్లోరిడాలో జరిగింది. ఈ భేటీలో ఆసియా కప్‌, ప్రపంచకప్‌ కోసం ప్రత్యేకంగా ప్లానింగ్‌ను రూపొందించినట్లు స్పష్టమవుతుంది. ఈ భేటీ తర్వాత కోచింగ్‌ సిబ్బందిని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 2021 టీ ప్రపంచకప్‌కు ముందు బీసీసీఐ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని మెంటార్‌గా బీసీసీఐ నియమించింది. ఈ నెల 30 నుంచి ఆసియా కప్‌ జరుగాల్సి ఉంది. ఈ టోర్నీకి ఇంకా మేనేజ్‌మెంట్‌ టీమ్‌ను ప్రకటించలేదు. త్వరలోనే టీమ్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. టోర్నీని ఎంపిక చేసిన తర్వాత 23న బెంగళూరులో భేటీకానున్నారు. 24న ఆలూరులో శిబిరం ప్రారంభంకానున్నది. ఇటీవలి ఫలితాలు టీమ్‌పై పలు విమర్శలకు దారితీశాయి. బీసీసీఐ ప్రపంచకప్‌ను నిర్వహిస్తుండగా.. ఎలాగైనా ఈ సారి ట్రోఫీని ఎగరేసుకుపోయేలా చూడాలని బీసీసీఐ భావిస్తున్నది.

బూమ్రా విషయంలో ఆ తర్వాత నిర్ణయం..

ప్రస్తుతం బీసీసీఐ ఆసియా కప్‌పై దృష్టి పెట్టింది. త్వరలోనే టీమిండియాను కప్‌ కోసం ప్రకటించే అవకాశం ఉంది. ఐర్లాండ్‌లో మొదటి టీ20 మ్యాచ్‌ తర్వాత ఆసియా కప్‌ కోసం టీమ్‌ను ఎంపిక జరగవచ్చని తెలుస్తున్నది. ఇక జస్ప్రీత్ బుమ్రా ఒక్కసారి మైదానంలో ఆడేలా చూడాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. బూమ్రా ఐర్లాండ్‌ పర్యటనతో మళ్లీ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐర్లాండ్‌ సిరీస్‌కు బీసీసీఐ కెప్టెన్‌గా నియమించింది. అయితే, గాయం కారణంగా బుమ్రా సెప్టెంబర్‌ 2022 నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ పరిస్థితుల్లో ఐర్లాండ్‌తో టీ20లో ఫిట్‌నెట్‌ చూసిన తర్వాత అతని ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నది.

అందరి దృష్టి రాహుల్‌, అయ్యర్‌లపైనే

ఇక కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ విషయానికి వస్తే.. వీరిద్దరూ ఇటీవల బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఇద్దరూ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నట్లయితే అది టీమ్ ఇండియాకు గొప్ప వార్త అవుతుంది. రాహుల్, అయ్యర్ లేకపోవడంతో భారత జట్టు మిడిల్ ఆర్డర్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. వీరిద్దరూ పునరాగమనం చేస్తే జట్టు మరింత పటిష్టంగా మారనున్నది.

Exit mobile version