Vemulavada | రాజన్న ఆలయంలో.. విజిలెన్స్ అధికారుల తనిఖీలు

Vemulavada | ప్రసాదాల తయారీ విభాగంపై, ప్రత్యేక దృష్టి విధాత బ్యూరో, కరీంనగర్: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఆలయంలోని పలు విభాగాలను వారు తనిఖీ చేశారు. ముఖ్యంగా ప్రసాదాల తయారీ విభాగంపై వారు దృష్టి సారించారు. భక్తుల కోసం లడ్డు తయారీలో వినియోగించే కాజు, కిస్మిస్, షుగర్, డ్రై ఫ్రూట్స్ తూకం వేయడంతో పాటు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. అలాగే పలు విభాగాల్లోని రికార్డులను కూడా విజిలెన్స్ […]

  • Publish Date - July 25, 2023 / 08:44 AM IST

Vemulavada |

  • ప్రసాదాల తయారీ విభాగంపై, ప్రత్యేక దృష్టి

విధాత బ్యూరో, కరీంనగర్: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

మంగళవారం ఆలయంలోని పలు విభాగాలను వారు తనిఖీ చేశారు. ముఖ్యంగా ప్రసాదాల తయారీ విభాగంపై వారు దృష్టి సారించారు.

భక్తుల కోసం లడ్డు తయారీలో వినియోగించే కాజు, కిస్మిస్, షుగర్, డ్రై ఫ్రూట్స్ తూకం వేయడంతో పాటు, నాణ్యత ప్రమాణాలను పరిశీలించినట్టు తెలుస్తోంది.

అలాగే పలు విభాగాల్లోని రికార్డులను కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే సాధారణ తనిఖీల్లో ఇది భాగమేనని ఆలయ అధికారులు అంటున్నారు.