Warangal
- ఎమ్మెల్సీ కడియం పై విమర్శలు
- కడియం కుమార్తె ఎస్సీ కిందకు రాదు
- ఆడియో,వీడియోలు కోర్టులో తేల్చుకుంటా
- స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు ఎన్కౌంటర్ల సృష్టికర్త అంటూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పైన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సకల జనుల సమ్మెలో కాంగ్రెస్ పార్టీ నుండి రాజయ్య రాజీనామా చేస్తే పోటీ చేయనన్న కడియం శ్రీహరి మాట నిలబెట్టుకోలేదన్నారు. నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళగా, మొట్టమొదట TDP నుండి నామినేషన్ వేశాడని విమర్శించారు.
కులము ఆత్మగౌరవంతో సమానమని ఆ కుల ప్రస్తావన జరగాలన్నారు. పార్టీ నుండి బహిష్కరించిన వారే కడియం వెంట ఉన్నారు.. నియోజకవర్గ ప్రజలు నా వెంట ఉన్నారని రాజయ్య అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రకు చెందిన దూదేకుల వ్యక్తిని పెళ్లి చేసుకున్న కడియం శ్రీహరి కూతురు ఎస్సీ కాదు, బిసి బి కులానికి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఆడియోలు, వీడియోలు అంటూ నాపై వస్తున్న ఆరోపణలను కోర్టు ద్వారా ఎదుర్కొంటానంటూ చెప్పారు.
కడియం వెంట ఉన్నవారు స్థానికులే, నియోజకవర్గానికి వెన్నుపోటు పొడవరనే విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 85 వేల ఎస్సీల ఓట్లు ఉంటే… 68,000 ఓట్లు నికార్సైన మాదిగలవేనని రాజయ్య చెప్పారు.