Warangal | కొండాయి మృతులకు రూ. 25లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: మందకృష్ణ మాదిగ

Warangal గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కొండాయి బాధిత కుటుంబాలకు పరామర్శ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జంపన్న వాగు వరదలో కొట్టుకు పోయి చనిపోయిన వారి ప్రతి కుటుంబానికి 25లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. తక్షణ సహాయం క్రింద ప్రభుత్వం ప్రకటించిన 50వేల రూపాయలు వెంటనే మంజూరి చేయాలని కోరారు. గత నెల 26న కురిసిన భారీ […]

  • Publish Date - August 1, 2023 / 12:34 AM IST

Warangal

  • గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలి
  • ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
  • కొండాయి బాధిత కుటుంబాలకు పరామర్శ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జంపన్న వాగు వరదలో కొట్టుకు పోయి చనిపోయిన వారి ప్రతి కుటుంబానికి 25లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. తక్షణ సహాయం క్రింద ప్రభుత్వం ప్రకటించిన 50వేల రూపాయలు వెంటనే మంజూరి చేయాలని కోరారు.

గత నెల 26న కురిసిన భారీ వర్షానికి నేలమట్టమై, ప్రాణాష్టం జరిగిన కొండాయి మల్యాల గ్రామాన్ని మంగళవారం మందకృష్ణ మాదిగ సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు.

తక్షణమే కొండాయి, మల్యాల గ్రామాలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించి ప్రభుత్వ భూమి కేటాయించి అందరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి శాశ్వత మైన ఏర్పాట్లు చేయాలని కోరారు. నాసిరకంగా నిర్మించి, ఇసుక తవ్వకాలతో బలహీనపడి జంపన్న వాగు ఉధృతికి కొట్టుకు పోయిన బ్రిడ్జిని వెంటనే నాణ్యతతో నిర్మించి రవాణా సౌకర్యం కల్పించాలని, వరదలతో కొట్టుకు పోయిన పంటలను అంచనా వేసి, ప్రతి రైతుకి పంట నష్టపరిహారం వెంటనే మంజూరి చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు.

బ్రిడ్జిని పరిశీలించిన కృష్ణమాదిగ

నాసిరకంగా నిర్మించి, ఇసుక తవ్వకాలతో జంపన్న వాగు వరదలో కొట్టుకుపోయిన కొండాయి బ్రిడ్జిని కృష్ణమాదిగ పరిశీలించారు. వర్ష బీభత్సంతో దుర్గంధం వెదజల్లుతూ, నివాసయోగ్యంగా లేని, కూలిపోయిన గోడలతో ఉన్న కొండాయి, మల్యాల ఇండ్లను, అదేవిధంగా కుటుంబ సభ్యులను కోల్పోయి, కట్టుబట్టలతో వర్షం సృష్టించిన సంఘటనతో పుట్టెడు దుఃఖం తో ఉన్న కుటుంబ సభ్యులను కలిశారు. 8మంది చావులకు కారణమైన ప్రమాద స్థలాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో కొండాయి గ్రామ సర్పంచి కాక వెంకన్న, ములుగు జిల్లా ఇన్చార్జి గుగ్గిళ్ళ పిరయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్‌ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ, చత్తీస్గడ్ రాష్ట్ర ఇంచార్జి ఇరుగుపైడి మాదిగ, మడి పెళ్లి శ్యాం బాబు మాదిగ, వావిలాల స్వామి మాదిగ, గజ్జల ప్రసాద్ మాదిగ, నెమలి నరసయ్య మాదిగ, పుల్లూరి కర్ణాకర్ మాదిగ, జన్ను రవి, నద్దునూరి రమేష్ మాదిగ, వావిలాల సాంబశివరావు మాదిగ, ఎంపెల్ శంకర్ మాదిగ, దేపాక సతీష్ మాదిగ, ఏంపెళ్లి మల్లేష్ మాదిగ, తోకల రాంబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Latest News