Koya Wedding Card:
విధాత ప్రత్యేక ప్రతినిధి: మనం వివిధ భాషలో పెళ్ళి పత్రికలు చూస్తుంటాం. తమ తమ మాతృ భాషలో లేక హిందీ, ఇంగ్లీసు భాషల్లో ఆహ్వానపత్రికలు ముద్రించడం పరిపాటి. ఆదివాసీలకు ప్రత్యేక భాష ఉంటుందనీ మనకు తెలుసు, అందులో ఒక తెగగా గుర్తింపు పొందిన కోయ (Koya) జాతికి కూడా ప్రత్యేక భాష ఉంటుంది.
ఆధిపత్య భాషలు, ఆధిపత్య సంస్కృతి, లిపి లేని కారణంగా అనేక భాషలు కనుమరుగవుతున్నాయనే విమర్శలున్నాయి. ఆ కోవకు చెందినదే కోయ భాషగా పేర్కొంటారు. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఆదివాసీ కోయ తెగకు చెందిన ఉన్నత విద్యావంతుల కుటుంబం తమ భాష పరిరక్షణ కోసం ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది.
తమ ఇంట్లో పెళ్ళికి కోయ భాషలో శుభలేఖను ప్రింట్ చేయడం గమనార్హం. బ్యాంకు ఉద్యోగి, ఉపాధ్యాయ దంపతులు ఉండం బాలరాజు, అనిత దంపతులు వివాహశుభ లేఖను తమ భాషలో ప్రింట్ చేశారు. మార్చి 2వ తేదీ ఆదివారం ఇల్లందులోని జేకే కాలనీలోని క్లబ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వివాహా శుభ లేఖలో పెళ్ళి కొడుకును ‘పెళ్ళి పేకల్’ పెళ్ళి కుమార్తెను ‘పెళ్ళి కోకడ్’ పేర్కొన్నారు. ఈ శుభ లేఖ మీ కోసం.