YS Sharmila | షర్మిల హౌస్ అరెస్ట్.. పోలీసులకు హారతినిచ్చి వినూత్న నిరసన

ఇంటి వద్దనే నిరసన దీక్ష YS Sharmila | విధాత: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గజ్వేల్ పర్యటనకు వెళ్లకుండా ఆమెను పోలీసులు ముందస్తుగానే హౌజ్ అరెస్టు చేశారు. షర్మిల నివాసం లోటల్ పాండ్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు అమె గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదంటు ఇంటి వద్దనే అడ్డుకున్నారు. దీంతో షర్మిల తాను గజ్వల్‌కు వెళ్లితీరుతానంటు పోలీసులత వాగ్వివాదానికి దిగారు. తనను అడ్డుకున్న పోలీసులకు ఆమె హారతినిచ్చి ఇకమీదటనైనా సరిగా డ్యూటీ చేయండని, సీఎం […]

  • Publish Date - August 18, 2023 / 12:05 PM IST

  • ఇంటి వద్దనే నిరసన దీక్ష

YS Sharmila | విధాత: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గజ్వేల్ పర్యటనకు వెళ్లకుండా ఆమెను పోలీసులు ముందస్తుగానే హౌజ్ అరెస్టు చేశారు. షర్మిల నివాసం లోటల్ పాండ్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు అమె గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదంటు ఇంటి వద్దనే అడ్డుకున్నారు. దీంతో షర్మిల తాను గజ్వల్‌కు వెళ్లితీరుతానంటు పోలీసులత వాగ్వివాదానికి దిగారు. తనను అడ్డుకున్న పోలీసులకు ఆమె హారతినిచ్చి ఇకమీదటనైనా సరిగా డ్యూటీ చేయండని, సీఎం కేసీఆర్‌కు తొత్తులుగా పనిచేయడం మానాలని కోరారు.

అనంతరం ఆమె సీఎం కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా ఇంటివద్దనే తన నిరసన దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తనకు గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదంటున్న పోలీసులు, బీఆరెస్ నాయకుల పర్యటనలకు అనుమతులు అడుగుతున్నారా అంటు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత బంధు సక్రమంగా అమలు కావడం లేదని, దీనిపై జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామస్తులు ఆందోళన చేశారన, వారి మద్దతుగా తాను అక్కడ పర్యటించాలనుకంటే అనుమతి లేదంటు పోలీసులతో సీఎం కేసీఆర్ అడ్డుకున్నారన్నారు.

సీఎం కేసీఆర్ తనను చూసి భయపడుతున్నాడని, అందుకే తన పర్యటనలను, యాత్రలను అడ్డుకుంటున్నాడని షర్మిల విమర్శించారు. సీఎం కేసీఆర్ దళిత బంధును 17లక్షల మందికి ఇవ్వాల్సివుండగా, ఇప్పటి వరకు కేవలం 34వేల మందికి మాత్రమే ఇచ్చారన్నారు. దళిత బంధు కేసీఆర్ అనుచర బంధుగా మారిపోయిందని, ఎమ్మెల్యేలు కూడా ఇందులో నిమిత్తమాత్రులని, రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి, నియంతృత్వ పాలన సాగుతుందన్నారు.

Latest News