Chewing Gum | మీరు చూయింగ్ గ‌మ్ తింటున్నారా..? అయితే న‌పుంస‌కులుగా మారే ఛాన్స్‌..!

Chewing Gum | చాలా మందికి టైమ్ పాస్‌కు చూయింగ్ గ‌మ్ తినే అల‌వాటు ఉంటుంది. కానీ టైమ్ పాస్‌కు తినే దీని వ‌ల్ల భ‌విష్య‌త్‌లో నపుంస‌కులుగా మారే ప్ర‌మాదం ఉంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అస‌లు చూయింగ్ గ‌మ్ తింటే న‌పుంస‌కులుగా ఎలా మారుతారు అనే అంశంపై వివ‌రంగా తెలుసుకుందాం.

Chewing Gum | మ‌నం తినే ఆహార ప‌దార్థాల‌కు సంబంధించిన ఉత్ప‌త్తుల్లో చాలా వ‌ర‌కు మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయి. ఈ మైక్రో ప్లాస్టిక్ ప‌దార్థాల్లో చూయింగ్ గ‌మ్ కూడా చేరింది. చాలా మంది మ‌గ‌వారు ఈ చూయింగ్ గ‌మ్‌ను తింటూ ఉంటారు. చాలా మంది పురుషుల‌కు ఇది వ్య‌స‌నం కూడా. అయితే చూయింగ్ గ‌మ్‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోకి మ‌న‌కు తెలియ‌కుండానే చిన్న ప్లాస్టిక్ క‌ణాలు చేరుతాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లాస్టిక్ క‌ణాల వ‌ల్ల నపుంస‌కులుగా మారి, సంతానోత్ప‌త్తి స‌మ‌స్య‌లు ఎదుర్కొనే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్ఆన‌రు.

చూయింగ్ గ‌మ్‌లో మైక్రో ప్లాస్టిక్స్..

మ‌నం తినే ఆహార ప‌దార్థాల్లో చాలా వ‌ర‌కు చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు ఉంటాయి. ఆహార ప‌దార్థాల ద్వారానే కాకుండా.. నీరు, గాలి ద్వారా కూడా ప్లాస్టిక్ రేణువులు శ‌రీరంలోకి చేరుతాయి. అలాగే చూయింగ్ గ‌మ్‌ల త‌యారీకి ఉప‌యోగించే సింథ‌టిక్ ప‌దార్థాల్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎంత వ‌ర‌కు ప్ర‌మాదం..?

కొన్ని గమ్‌లలో “గమ్ బేస్” అనే పదార్థం సింథటిక్ పాలిమర్స్‌తో తయారవుతుంది. వాటిని ఎక్కువగా నమిలితే.. అది చిన్న కణాలుగా విడిపోయి.. శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీలో 2025లో నివేదించిన అధ్యయనం ప్రకారం.. సంతానోత్పత్తి చికిత్స పొందుతున్న మహిళల నుంచి సేకరించిన నమూనాలలో 69 శాతం, పురుషుల నుంచి సేకరించిన నమూనాలలో 55 శాతం మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో 2024లో చేసిన అధ్యయనంలో కూడా మానవ వృషణ కణజాలంలో మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నారు.

స్పెర్మ్ కౌంట్ త‌గ్గే అవ‌కాశం..?

చూయింగ్ మగవారి సంతాన సమస్యలపై ప్రభావం చూపిస్తుందని పూర్తి స్థాయిలో నిర్ధారణ లేదు. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం.. మైక్రోప్లాస్టిక్స్ శరీరంలో చేరితే హార్మోన్‌ల అసమతుల్యతకు కారణమవచ్చు. అలాగే టెస్టోస్టెరోన్ స్థాయిలపై ప్రభావం చూపి.. స్పెర్మ్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగితే ఫెర్టిలిటీపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Latest News