ఈ మధ్యకాలంలో చాలా మంది అబ్బాయిలు చెవులు కుట్టించుకోవడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. కేవలం స్టైల్ కోసమే చెవులు కుట్టించుకుని రకరకాల ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నారు. కానీ ఇంతకు ముందైతే చాలా మంది సాంప్రదాయబద్ధంగా అబ్బాయిలకు చెవులు కుట్టించేవారు. ఇంతకు అబ్బాయిలు చెవులు కుట్టించుకోవడం వల్ల లాభమా, నష్టమా అని చూస్తే మాత్రం.. లాభాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. అవునండీ.. చెవులు కుట్టించుకోవడం వలన చాలా షార్ప్‌గా ఉంటారట.. అలాగే దృష్టి కేంద్రీకరించడంలో తోడ్పడుతుందట.
చెప్పాలంటే చాలా సంస్కృతుల్లో చెవులు కుట్టించుకున్న మగవారిని దార్శానికులుగా పరిగణిస్తారు. ఇది మాత్రమే కాకుండా చెవిలో బంగారం, రాగిని ధరించడం వలన శరీరంలో సహజంగా ఉన్న విద్యుత్‌ను సులభతరంగా ప్రవహించేలా చేస్తుంది. చెవి కుట్టించుకున్న అబ్బాయిల్లో త్వరగా పరిపక్వం చెందుతారని అంటుంటారు. మిగతా పిల్లలతో పోలుస్తే చెవి కుట్టించుకున్న అబ్బాయిల్లో వారి జీవితాన్ని త్వరగా అర్థం చేసుకొని ముందుకు వెళతారట. ఇదిమాత్రమే కాదండోయ్.. చెవులు కుట్టించుకున్న పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే అలర్జీలు, మైగ్రేన్‌లను తగ్గించే ఆక్యూప్రెషర్ థెరపీ కోసం చెవులు కుట్టడం ప్రయోజనకరమని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. దీంతోపాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుందని నమ్ముతారు.
