Site icon vidhaatha

IndiGo flights | 192 ఇండిగో ఫ్లైట్లు రద్దు.. అందుబాటులో లేని రిఫండ్‌, రీబుకింగ్‌

న్యూఢిల్లీ: ప్రపంచ ట్రావెల్‌ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య కారణంగా 192 విమానాలను రద్దు చేసినట్టు ఇండిగో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ సమస్యతో వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. రీబుకింగ్‌, టికెట్‌ సొమ్ము రిఫండ్‌ ఆప్షన్లు ప్రస్తుతానికి అందుబాటులో లేవని ఇండిగో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఈ సమస్య తమ నియంత్రణలో లేదని ఎక్స్‌లో పేర్కొన్నది.

మైక్రోసాఫ్ట్‌ అజూర్‌తో నెట్‌వర్క్‌ సమస్యలు తలెత్తాయని ఇండిగో తెలిపింది. ఫలితంగా విమానాశ్రయాల్లో తీవ్ర ఆలస్యం అవుతున్నదని పేర్కొన్నది. ‘చెక్‌ ఇన్స్‌ మెల్లగా సాగుతున్నాయి. క్యూలు భారీగా ఉంటున్నాయి. సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు మైక్రోసాఫ్ట్‌తో మా డిజిటల్‌ టీమ్‌ పనిచేస్తున్నది. సహాయం కోసం మా ఆన్‌గ్రౌండ్‌ టీమ్‌ను సంప్రదించండి’ అని మరొక అప్‌డేట్‌లో తెలిపింది.

కొన్ని సర్వీసులు ప్రభావితమైనట్టు ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ తెలిపింది. చెక్‌ ఇన్స్‌ వద్ద భారీ క్యూ లైన్లు ఉంటున్నాయని అనేక మంది ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేశారు. విమానాల సమయాలు తెలిపే డిస్‌ప్లే బోర్డులు, బ్యాగేజ్‌ కౌంటర్లు సైతం పనిచేయడం లేదు

Exit mobile version