Ravan Effigy | చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ( Dasara Festival )ను జరుపుకుంటారు. రావణాసురుడిని( Ravana ) సంహరించి విజయాన్ని సాధించిన శ్రీరాముడిని( Lord Srirama ) ఈ రోజు గుర్తు చేసుకుంటారు. అందుకే చెడుపై మంచి గెలిచిన దానికి చిహ్నంగా ప్రతి ఏడాది విజయ దశమి( Vijaya Dashami )రోజున రావణుడి దిష్టిబొమ్మ( Ravan Effigy )ను దహనం చేసే సంప్రదాయం వస్తుంది.
ఇక ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలకు దేశమంతా సిద్ధమవుతంది. రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు శ్రీరామ భక్తులు సిద్ధమవుతున్నారు. అయితే ఢిల్లీలోని శ్రీరామ్ లీలా సొసైటీ( Sri Ram Lila Society ) ఆధ్వర్యంలో దేశంలోనే అత్యంత ఎత్తైన రావణుడి దిష్టిబొమ్మను తయారు చేయించారు. ద్వారకాలోని సెక్టార్ 10లో 211 అడుగుల ఎత్తులో రావణుడి దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు. ఈ దిష్టిబొమ్మ దేశంలోనే అత్యంత ఎత్తైనది అని, దీన్ని దసరా నాడు దహనం చేస్తామని శ్రీరామ్ లీలా సొసైటీ చైర్మన్ రాజేశ్ గెహ్లాట్ పేర్కొన్నారు.
రావణుడి దిష్టిబొమ్మ ఏర్పాటుకు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 400 మంది ఆర్టిస్టులకు అడిషన్స్ నిర్వహించి, ఫ్రెష్ టాలెంట్ ఉన్నవారిని గుర్తించామన్నారు. వారు నాలుగు నెలల పాటు శ్రమించి, ఈ దిష్టిబొమ్మను తయారు చేశారని రాజేశ్ తెలిపారు. ఈ సమాజంలో పాపాలు పెరిగిపోతున్నాయని, దానికి ప్రతీకగా 211 అడుగుల ఎత్తులో రావణుడి దిష్టిబొమ్మను తయారు చేయించామన్నారు. పెరిగిపోతున్న పాపాలన్నింటినీ దసరా రోజును కాల్చేస్తామన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi )తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను ఆహ్వానించామని రాజేశ్ పేర్కొన్నారు. మోదీ ఈ వేడుకకు హాజరవుతారనే విశ్వాసం తమకు ఉందన్నారు. ఇక రావణుడి దిష్టిబొమ్మ వద్ద 50 మంది ఢిల్లీ పోలీసులు, 200 మందికి పైగా వాలంటీర్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.