Crocodile | భువనేశ్వర్ : నది( River )లో స్నానానికి( Bath ) వెళ్లిన ఓ మహిళ( Woman ) ఘోర ప్రమాదానికి గురైంది. నీటిలో ఉన్న ఓ భారీ మొసలి( Crocodile ) ఆమెను నదిలోకి లాక్కెళ్లి.. దాడి చేసి చంపేసింది. ఈ దారుణ ఘటన ఒడిశా( Odisha )లోని కేంద్రపారా జిల్లాలో సోమవారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కేంద్రపారా జిల్లాలోని రాజ్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ సమీపంలో ఓ జాతీయ పార్కు( National Park ) ఉంది. దీంట్లో మొసళ్లు ఉంటాయి. ఈ పార్కుకు సమీపంలోనే ఖరస్రోత నది కూడా ఉంది. తన్లాడియా గ్రామానికి చెందిన ఓ 45 ఏండ్ల మహిళ నదిలోకి సోమవారం స్నానానికి వెళ్లింది. స్నానం చేస్తుండగా.. మహిళను ఓ భారీ మొసలి నది మధ్యలోకి లాక్కెళ్లింది. అనంతరం ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి చంపింది.
గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక మృతురాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ నేషనల్ పార్కు సమీపంలో ఉన్న నదిలో గత 22 నెలల కాలంలో 11 మందిని మొసళ్లు చంపినట్లు నివేదికలు చెబుతున్నాయి.