Site icon vidhaatha

Election Result | అరుణాచల్‌ మళ్లీ బీజేపీదే ..సిక్కింలో ఎస్కేఎం స్వీప్‌

ఇటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. 60 సీట్లు ఉన్న అరుణాచల్‌ అసెంబ్లీలో ఇప్పటికే పది సీట్లను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నది. మిగిలిన 50 స్థానాలకు ఆదివారం కౌంటింగ్‌ నిర్వహించారు. ఇందులో 33 సీట్లను బీజేపీ గెలుచుకున్నది. దీంతో బీజేపీకి మొత్తం 43 స్థానాలు లభించాయి. తాజా సమాచారం అందేసరికి నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీఈపీ) 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ (పీపీఏ) 2 సీట్లలో ముందంజలో ఉన్నది. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) మూడు సీట్లలో, కాంగ్రెస్‌ ఒక సీట్లో, స్వతంత్రులు రెండు సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 31 స్థానాలు గెలుచుకున్నది. జేడీయూ ఏడు, ఎన్‌పీపీ 5, కాంగ్రెస్‌ 4, పీపీఏ 1 గెలుచుకున్నాయి. స్వతంత్రులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. భారీ వర్షం నడుమ 24 జిల్లా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 6 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైంది.

సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా స్వీప్‌

సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) మరోసారి స్వీప్ చేసింది. మొత్తం 32 స్థానాలకు గాను 30 సీట్లలో ఎస్‌కేఎం ఆధిక్యంలో ఉన్నది. ముఖ్యమంత్రి, ఎస్‌కేఎం అభ్యర్థి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ తన సమీప ఎస్‌డీఎఫ్‌ ప్రత్యర్థిపై 6,443 ఓట్ల ఆధిక్యం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి, సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) అధినేత పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ తన సమీప ఎస్‌కేఎం అభ్యర్థి రాజు బస్నెట్‌ చేతిలో 1852 ఓట్లు వెనుకబడి ఉన్నారు. ఎస్డీఎఫ్‌ అభ్యర్థి, భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ భాయ్‌చుంగ్‌ భుటియా తన సమీప ఎస్‌కేఎం అభ్యర్థి రిక్సల్‌ దోర్జీ భుటియా చేతిలో 4,346 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌కేఎం 17 సీట్లు, ఎస్‌డీఎఫ్‌ 15 సీట్లు గెలుచుకున్నాయి.

 

Read More

CM Revanth Reddy | తెలంగాణ చరిత్ర పుటల్లో.. ఆ ముగ్గురు మహిళలు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

Sonia Gandhi | ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది

Election Result | అరుణాచల్‌ మళ్లీ బీజేపీదే ..సిక్కింలో ఎస్కేఎం స్వీప్‌

Election Result | అరుణాచల్‌ మళ్లీ బీజేపీదే ..సిక్కింలో ఎస్కేఎం స్వీప్‌

Exit mobile version