Assembly Elections | మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ షురూ..

Assembly Elections | కేర‌ళం, అసోం రాష్ట్రాల‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

Assembly Elections | కేర‌ళం, అసోం రాష్ట్రాల‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. మూడు రాష్ట్రాల్లో క‌లిసి 6.1 కోట్ల‌కు పైగా ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

అసోంలో 126 స్థానాల‌కు 722 మంది పోటీ

అసోం అసెంబ్లీలోని 126 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. మొత్తం 35 జిల్లాల్లో 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 126 నియోజకవర్గాల్లో బరిలో నిచిలిన 722 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం అభ్యర్థుల్లో కేవలం 59 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 99 స్థానాల్లో, బీజేపీ 90 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 1.25 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 6.42 లక్షల మంది తొలిసారి ఓటు వేయనున్నారు.

కేర‌ళంలో 883 మంది పోటీ

కేర‌ళంలో 140 అసెంబ్లీ స్థానాల‌కు 883 మంది పోటీ ప‌డుతున్నారు. 883 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2.71 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఇందులో 1.32 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు, 273 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అటు దాదాపు 2.42 లక్షల మందికి పైగా విదేశీ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. కేరళలో ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 30 వేల 495 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

పుదుచ్చేరిలో 30 స్థానాలు.. 294 మంది పోటీ

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం 1,099 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరి, కారైకల్, మాహే, యానాం ప్రాంతాలలో కలిపి అసెంబ్లీలో ముప్పై సీట్లకు 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, ప్రధానంగా ఎన్​డీఏ- ఇండియా కూటమికి మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ మొత్తం 9,48,977 మంది ఓటర్లు ఉండగా, అందులో 4,45,761 మంది పురుషులు, 5,03,076 మంది మహిళలు, 140 మంది ట్రాన్స్​జెండర్లు ఉన్నారు.

Latest News