12న అస్సాం సీఎంగా హిమంత్ బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం

అస్సాం బీజేపీ పక్ష నేతగా తాత్కాలిక సీఎం హిమంత్ బిశ్వశర్మ ఎన్నికయ్యారు. ఈనెల 12న ఆయన సీఎంగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | May 10, 2026, 11:53 am IST
Read Time: 2 mins
12న అస్సాం సీఎంగా హిమంత్ బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం

విధాత : అస్సాం బీజేపీ పక్ష నేతగా తాత్కాలిక సీఎం హిమంత్ బిశ్వశర్మ ఎన్నికయ్యారు. ఈనెల 12న ఆయన సీఎంగా పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన సీఎం పదవి చేపట్టనుండడం వరుసగా రెండోసారి కావడం విశేషం. ఇటీవల జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంలో హిమంత్ బిశ్వశర్మ కీలకంగా వ్యవహరించారు.మొత్తం 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో బీజేపీ కూటమి ఏకంగా 102 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. దీంతో అస్సాంలో వరుసగా మూడోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టబోతుండటం విశేషం.

ఆదివారం జరిగిన బీజేపీ లెజిస్టేచర్‌ పార్టీ సీఎంగా హిమంత్ బిశ్వశర్మ పేరును ఏకగ్రీవంగా ఆమోదించింది. మిత్ర పక్షాలైన బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌, అసోం గణపరిషత్‌లు కూడా సీఎంగా హిమంత్ పేరుకు ఆమోదం తెలిపాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాతోపాటు, ఎన్‌డీఏ కూటమి ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.