వరదల్లో కట్టెల వేట… వైరల్ వీడియో!

బీహార్ కోసీ బ్యారేజీ వరదల్లో యువకులు ప్రాణాలను పణంగా పెట్టి కలప దుంగలను సేకరిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదకర జీవనోపాధిపై చర్చ సాగుతోంది.

వరదలలో కట్టెల వేట..వినడానికి, చూడటానికి ఆశ్చర్యంగా ఉన్నా..యువకులు బీహార్ లోని కోసీ బ్యారేజీ వరదల నుంచి కట్టెలను సేకరిస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఇది ఓ రకంగా పుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగల రవాణా కోసం హీరో పడిన పాట్లను…చరిత్రలో ఆది మానవులు నదులలో ఈటెలతో సాగించిన వేట దృశ్యాలను తలపించింది. బీహార్‌లోని కోసి బ్యారేజీ కాంక్రీట్ పిల్లర్ పై నిలబడి ఇద్దరు యువకులు కిందుగా దూసుకపోతున్న వరదలలో కొట్టుకపోతున్న పొడవాటి కర్రలు, మొద్దులను చాకచక్యంంగా సేకరించడం అందులో వారి పనితనానికి నిదర్శనంగా నిలిచింది.

తాళ్లకు చివరన బిగించిన పదునైన ఇనుప మొనలను వినియోగించి..దానిని ఈటె మాదిరిగా ఉయోగించి కింద వేగంగా ప్రవహిస్తున్న నది వరదలలో కొట్టుకపోతున్న దుంగలపైకి విసరుతారు. దుంగలకు ఇనుప మొన దిగగానే ఆ దుంగలను పైకి లాగుతూ, పిల్లర్ పై పెట్టుకుని…మరో దుంగను సేకరించే పని చేస్తారు. ఇలా సేకరించిన దుంగలు ఓ కుప్పగా పిల్లర్ పై వీడియోలో కనిపిస్తున్నాయి.

బీకర వరదలకు ప్రసిద్ది అయిన కోసి నదిని.. బీహార్ దుఃఖదాయినిగా పిలుస్తారు. జీవనోపాధి కోసం యువకులు వరదలలో కొట్టుకవచ్చే కలప దుంగల సేకరణ కోసం చేసే పని అత్యంత ప్రమాదకరమైన జీవనోపాధి మార్గం అని, ఈ ప్రయత్నంలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలను ప్రభుత్వం నియంత్రించాలన్న వాదన సైతం వినిపిస్తుంది.

Latest News