క్వారంటైన్ సెంటర్లు, నిర్దారణ పరీక్షలకు ముమ్మర ఏర్పాట్లు
ఓ బాలుడు ఈ వైరస్ వల్లే చనిపోయినట్టు ఎన్ఐవీ ధృవీకరణ
విధాత: కేరళలో మళ్లీ చెలగేరిన నిఫా వైరస్‌తో కేంద్రం అప్రమత్తమయ్యింది. అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు, క్వారెంటైన్ సెంటర్లకు ఏర్పాట్లు చేసింది. కేరళతో పాటు రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. నిఫా వైరస్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇది కేరళలో మరోసారి వెలుగు చూడటంతో ఇప్పుడు నిఫా వైరస్ మళ్లీ అంతటా కలకలం రేపుతోంది..
బాలుడి మృతితో వెలుగులోకి..
మళ్లీ కేరళలో నిఫా వైరస్ కలకలంరేపింది. ఓ పద్నాలుగేళ్ల బాలుడు ఈ వైరస్ వల్లే చనిపోయాడని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) ధృవీకరించడంతో అక్కడి యంత్రాంగం అప్రమత్తమయ్యింది. మలప్పురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ మేరకు అధికారింగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ బాలుడితో కాంటాక్ట్ అయిన 214 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచామని ఆయన తెలిపారు. వీరిలో 60 మందిని హైరిస్క్ కేటగిరీగా గుర్తించి చికిత్సలు అందిస్తున్నారు. నిఫా వైరస్ విస్తృతి నేపథ్యంలో ఆ జిల్లాలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. రాకపోకలపై ఆంక్షలు విధించారు.