UP | యూపీలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురి మృతి.. 20 మందికి గాయాలు

యూపీలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్నది. చండీగఢ్‌..డిబ్రూఘర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆరు బోగీలు ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో పట్టాలు తప్పాయి

UP | యూపీలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురి మృతి.. 20 మందికి గాయాలు

లక్నో: యూపీలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్నది. చండీగఢ్‌..డిబ్రూఘర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆరు బోగీలు ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారని,ముగ్గురు పరిస్థితి విషమం , ప్రాథమిక వార్తలను బట్టి తెలుస్తున్నది. మరో 20 మంది వరకు గాయపడ్డారు. అసోంలోని డిబ్రూఘర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు బుధవారం రాత్రి 11.35 చండీగఢ్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరింది. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో మోతీగంజ్‌, ఝిలాహి రైల్వే స్టేషన్ల మధ్య ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.

విషయం తెలిసిన వెంటనే అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌.. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. దాదాపు 15 అంబులెన్సులలో క్షతగాత్రులను హాస్పిటళ్లకు తరలించారు. ఘటనాస్థలంలో 40 మందికిపైగా వైద్య సిబ్బంది గాయపడినవారికి చికిత్స అందించారు. ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో రైలింజన్‌లో ఉన్న ఇద్దరు లోకో పైలట్లు సురక్షితంగా ఉన్నారని తెలుస్తున్నది. రైలు ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గం నుంచి వెళ్లే 11 రైళ్లను దారి మళ్లించారు.

‘చండీగఢ్‌.. డిబ్రూఘర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైతులు ఉత్తరప్రదేశ్‌లోని గోండా సమీపంలో మధ్యాహ్నం 2.35 గంటల సమయంలో పట్టాలు తప్పింది’ అని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ప్రమాదం దురదృష్టకరం : యోగి ఆదిత్యనాథ్‌

గోండా జిల్లాలో రైలు ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థించారు.