Delhi Car Blast | ఢిల్లీ పేలుడు కేసు: నిందితులకు 40 మందికి పైగా వైద్యులతో లింకులు

ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థలు తమదైన రీతిలో విచారణ చేస్తున్నారు.

Delhi Red Fort Blast
Delhi car Blast : ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థలు తమదైన రీతిలో విచారణ చేస్తున్నారు. పేలుడు కుట్రతో సంబంధం ఉన్న ఒక్కక్కరిని పోలీసుల బృందాలు, అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో పాటు దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతోంది. తాజాగా ప్రధాన నిందితులు డాక్టర్ షాహీన్, పర్వేజ్‌లతో 40 మందికి పైగా వైద్యులకు సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
పేలుడు పదార్థాలను నిల్వ చేసేందుకు కొన్ని ఆస్పత్రులను స్థావరాలుగా ఉపయోగించినట్టు బయటపడటంతో, జమ్ము–కశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లోని పలు ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహించారు. దర్యాప్తు నేపథ్యంలో ఎన్ఐఏ, యూపీ ఏటీఎస్ కలిసి 14 మంది వైద్యులను అదుపులోకి తీసుకున్నాయి. ఇందులో 9 మంది వైద్యులను విచారించి విడుదల చేశారు. మరో 5 మంది వైద్యుల విచారణ కొనసాగుతోంది. కేసు సంబంధితంగా వైద్యుల కాల్ డేటా, సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్టు ఎన్ఐఏ (NIA)వర్గాలు తెలిపాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన కారుబాంబు పేలుడులో 14మంది అమాయకులు చనిపోయారు. ఈ ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ కు చెందిన జైషే ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా దాడులకు 2023 నుంచి కుట్రలు పన్నుతున్నట్టు దర్యాప్తులో తేలింది.

Latest News