Delhi CM Rekha Gupta | న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా(Rekha Gupta)పై జన సున్వాయ్ కార్యక్రమంలో ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనతో అప్రమత్తమైన కేంద్రం ఆమెకు భద్రతను పెంచింది. సీఎం రేఖ గుప్తాకు జడ్ కేటగిరి సెక్యూరిటీని(‘Z’ Category Security) కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఇంటి వద్ద కూడా 40మందికి పైగా సీఆర్పీఎఫ్ బలగాలను నియమించింది.
మరోవైపు సీఎఎం రేఖా గుప్తాపై దాడి చేసిన గుజరాత్ కు చెందిన నిందితుడు రాజేష్ సకారియా తాను ఢిల్లీలో వీధి కుక్కలను తరలిస్తున్నారనే కోపంతోనే సీఎంపై దాడి చేశానని పోలీసులకు చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని ఇటీవల ఢల్లీ సీఎం రేఖాగుప్తా మీడియాకు తెలిపారు. జంతు ప్రేమికుడైన తనను ఈ విషయం ఎంతగానో బాధించడంతో.. ఈ చర్యలను నిలిపివేయాలని అభ్యర్థించడానికి ఆమెను కలిసేందుకు టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించి మరీ గుజరాత్ నుంచి ఢిల్లీ వచ్చినట్లు సకారియా చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కథనానలు ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా కొట్టిపారేశారు. నిందితుడు ముందస్తు పథకం మేరకు దాడి చేసినట్లుగా తెలిపారు.
ఇవి కూడా చదవండి…
కౌన్ బనేగా క్రోర్‌పతి-17: తొలి కోటీశ్వరుడిగా నిలిచిన ఆదిత్య కుమార్
కాసుల వర్షం కురిపిస్తున్న ‘క్యాప్సికం’ సాగు.. ఏడాదికి రూ. 4 కోట్లు సంపాదిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్