Bangladesh : బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ధ ఉద్రిక్తత

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ వీహెచ్‌పీ ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్‌ను ముట్టడించింది. ఈ క్రమంలో తోపులాట జరగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Bangladesh : బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ధ ఉద్రిక్తత

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాయలం వద్ధ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడును నిరసిస్తూ వీహెచ్ పీ ఆధ్వర్యంలో బంగ్లా హైకమిషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా..భద్రతా బలగాలు వారిని నిలువరించాయి. బారికేడ్ లను తోసివేసి ఆందోళన కారులు పోలీసులను దాటుకుని కమిషన్ కార్యాలయం లోపలివైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా బలగాలు వారిని అడ్డుకున్న క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం నెలకుని ఉద్రికత్త ఏర్పడింది. భద్రతా బలగాలు ఆందోళన కారులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

అమెరికా చట్టసభ సభ్యుల ఖండన

మరోవైపు బంగ్లాదేశ్‌లో మూకదాడులను, మైనార్టీ హిందువులపై జరుగుతున్న హత్యాకాండను అమెరికా చట్టసభ సభ్యులు ఖండించారు. ఇటీవల మయమన్‌సింగ్‌ జిల్లాలో దీపూ చంద్ర దాస్‌ అనే యువకుడు మూక దాడిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బంగ్లాలోని మైనార్టీల భద్రత, దయనీయ దుస్థితిని చాటింది. ఈ నేపథ్యంలో అమెరికా చట్టసభ సభ్యులు బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు భద్రత కల్పించాలని, చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి కోరారు.

బంగ్లా హింస షేక్ హసీనా ఆందోళన

అటు విద్యార్థి నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హాదీ మరణం నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు చెలరేగడంపై ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా ఆందోళన వెలిబుచ్చారు మొహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం హింసను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యూనస్ పాలనలో బంగ్లాదేశ్‌లో హింస సాధారణ విషయంగా మారిపోయిందని ఆరోపించారు. యూనస్‌ సర్కారు ఇస్లామిక్‌ తీవ్రవాద శక్తులకు అవకాశం కల్పిస్తోందంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. హింసాత్మక ఘటనలు బంగ్లాదేశ్‌ అంతర్గత స్థిరత్వాన్నే కాకుండా, పొరుగు దేశాలతో సంబంధాలనూ దెబ్బతీస్తున్నాయని విమర్శించారు.

బంగ్లాదేశ్‌ లో కొనసాగుతున్న హింసాత్మకత, భారత్ వ్యతిరేకత పరిణామాలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాతో దౌత్యానికి సమయం దాటిపోయిందని, ఇక శస్త్రచికిత్స అవసరమని వ్యాఖ్యానించారు. భారత రక్షణకు కీలకమై చికెన్స్ నెక్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి :

Anasuya | ముదురుతున్న శివాజీ కామెంట్స్ వివాదం.. నా బాడీ నా ఇష్టం అంటూ అన‌సూయ ఫైర్

Telangana cooperative societies| ఇకపై సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక వర్గాలు