Bangladesh T20 World Cup Withdrawal | భారత్ లో జరిగే టీ 20వరల్డ్ కప్ ఆడం : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
భారత్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. భద్రతా కారణాలతో మ్యాచ్‌ల వేదిక మార్పు అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో సంచలన నిర్ణయం తీసుకుంది.
విధాత : భారత్‌లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో ఆడటం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన ప్రకటన చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా తాము భారత్ లో జరిగే టీ 20 వరల్డ్ కప్ లో ఆడకూడదని నిర్ణయించుకున్నామని వెల్లడించింది. తమ జట్టు ఆడే మ్యాచ్ ల వేదికలను మరోదేశానికి మార్చాలని ఐసీసీకి బంగ్లా బోర్డు చేసిన విజ్ఞప్తి తిరస్కరించడంతో.. వరల్డ్ కప్‌లో ఆడకూడదని బంగ్లాదేశ్ నిర్ణయించుకోవడం గమనార్హం. బంగ్లాదేశ్ భారత్‌లో ఆడటానికి నిరాకరిస్తే, దాని స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంటామని ఇప్పటికే ఐసీసీ స్పష్టం చేసింది.
టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ఖరారైన షెడ్యూల్ మేరకు బంగ్లాదేశ్ కోల్‌కతాలో మూడు లీగ్ మ్యాచ్‌లు, ముంబైలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాలను చూపుతూ, తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరింది. ప్రస్తుతం, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్‌లతో పాటు గ్రూప్ సీలో ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ వైదొలిగితే, స్కాట్లాండ్ గ్రూప్ సీలో వారి స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. టోర్నీ నిర్వహణ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని ఐసీసీ చెప్పడంతో .. తాము భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ ప్రకటించింది.
బంగ్లాదేశ్ లో హిందువులపై హత్యకాండను భారత ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) నుంచి బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ను తీసేయడంతో భారత్ , బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం రేగింది. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ భారత్ లో జరిగే టీ 20ప్రపంచ కప్ ఆడకూడదని నిర్ణయించుకుంది.
ఇవి కూడా చదవండి :
Doda Tragedy | లోయలో పడిన ఆర్మీ వాహనం..10మంది కార్మికుల మృతి
Gravity Lose Fact Check | ఆ రోజు గురుత్వాకర్షణ శక్తిని కోల్పోనున్న భూమి.. వాస్తవాలేంటి? నాసా ఏం చెబుతున్నది?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram