Bangladesh Bans IPL Telecast : భారత్ పై బంగ్లాదేశ్ ప్రతీకార చర్యలు..ఐపీఎల్ పై నిషేధం
భారత్‌పై ప్రతీకారంగా బంగ్లాదేశ్ కీలక నిర్ణయం. దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
విధాత : భారత్ కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రతికార చర్యలకు దిగుతుంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న వరుస హింసాకాండ నేపథ్యంలో వచ్చిన విమర్శలకు స్పందించిన బీసీసీఐ ఐపీఎల్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఆ వెంటనే కేకేఆర్ ఫ్రాంచైజీ కూడా అతడిని రిలీజ్ చేసింది. దీనికి ప్రతికారంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముస్తాఫిజూర్ రెహమాన్ ను రిలీవ్ చేయడాన్ని నిరసిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది.
అంతకుముందే భారత్, శ్రీలంక వేదికగా వచ్చే నెలలో జరుగునున్న టీ20 వరల్డ్ కప్ 2026 లో తాము భారత్ లో ఆడబోమంటూ బంగ్లా మరో ప్రకటన చేసింది. తమ మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి (ICC) విజ్ఞప్తి చేసింది. తాజా పరిణామాలు బంగ్లా, భారత్ ల మధ్య దూరాన్ని మరింతగా పెంచేవిగా మారాయి.
ఇవి కూడా చదవండి :
99 Rupees Goat | సంక్రాంతి బంపర్ ఆఫర్.. 99 రూపాయలకే 12 కిలోల మేకపోతు!
AUS vs ENG : యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఎదురీత
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram