AUS vs ENG : యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఎదురీత

యాషెస్ ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌కు ధీటుగా ఆస్ట్రేలియా పోరాటం. రెండో రోజు ముగిసే సరికి ఆసీస్ 166/2తో క్రీజులో నిలిచింది.

AUS vs ENG : యాషెస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఎదురీత

విధాత : యాషెస్ సిరీస్ లో భాగంగా సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఎదురీదుతుంది. ఆస్ట్రేలియా రెండోరోజు ఆట ముగిసే సమయానికి 34.1 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ చేసిన తొలి ఇన్నింగ్స్ పరుగులకు ఆసీస్‌ జట్టు ఇంకా 218 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు 211/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ 97.3 ఓవర్లలో 384 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ జట్టు ఓపెనర్లు జేక్‌ వెదర్లాడ్‌, ట్రావిస్‌ హెడ్‌ మొదటి వికెట్‌కు 74 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం జేక్‌ వెదర్లాడ్‌ (21; 36 బంతుల్లో, 4 ఫోర్లు) బెన్‌స్టోక్స్‌ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. లబుషేన్‌ 48 పరుగులు(68 బంతుల్లో, 7 ఫోర్లు) చేసి హాఫ్ సెంచరీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. నైట్‌ వాచ్‌మన్‌గా వచ్చిన మిచెల్‌ నీసర్‌ (1*) నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బెన్‌స్టోక్స్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

జోరూట్ ఖాతాలో మరో భారీ శతకం

రెండో రోజు ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో జోరూట్‌ భారీ సెంచరీ (160; 242 బంతుల్లో, 15 ఫోర్లు) తో చెలరేగాడు. టెస్టుల్లో రూట్ కు ఇది 41వ సెంచరీ. దీంతో టెస్టు సెంచరీల రికార్డులలో రికీపాంటింగ్‌ సరసన నిలిచాడు. హ్యారీ బ్రూక్‌ 84 పరుగుల వద్ద (97 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్స్‌) పెవిలియన్‌కు చేరి సెంచరీ చేజార్చుకున్నాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జెమ్మీస్మిత్‌ (46; 76 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ నీసర్‌ 4, మిచెల్‌ స్టార్క్‌, స్కాట్‌ బోలాండ్‌ తలో రెండు, కామెరూన్‌ గ్రీన్, లబుషేన్‌ చెరో వికెట్‌ సాధించారు.

ఇవి కూడా చదవండి :

Chandrababu : తెలుగు జాతి ఐక్యత సాధనం తెలుగు భాష
Chandrababu : నది జలాలపై వివాదంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు