Chandrababu : నది జలాలపై వివాదంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గోదావరి-పెన్నా అనుసంధానం చేపడతామని, నీటి వృధాను అరికట్టడమే తమ లక్ష్యమని ప్రపంచ తెలుగు మహాసభల్లో స్పష్టం చేశారు.

Chandrababu : నది జలాలపై వివాదంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అమరావతి : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నది జలాల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు సరికాదు అని, సమైక్యత అవసరం అని..పరస్పం అర్ధం చేసుకుని కలిపి ముందడుగు వేయాల్సిన అవసం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం మాట్లాడారు. పోయిన ఏడాది 6,800టీఎంసీల గోదావరి, కృష్ణా నీళ్లు సముద్రంలోకి వెళ్లాయన్నారు. అందుచేత గోదావరి నీరు వృధా కాకుండా ఉండేందుకు గోదావరి-కృష్ణా నదులను అనుసంధానిస్తున్నామని, గోదావరి – పెన్నా నదులను కూడా అనుసంధానిస్తాం అని.. గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎవరికీ ఇబ్బంది ఉండదు అని తెలిపారు.

గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని..అందుకే నేను ఏనాడు అడ్డుచెప్పలేదని, కాళేశ్వరం కట్టినా తాను అడ్డుపడలేదన్నారు. తెలుగువారంతా నీటి విషయంలో కలిసి ఉండాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పాలనలో ఎన్నో నీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం అని, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఏఎంఆర్, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేశాం అని గుర్తు చేశారు. కృష్ణా డెల్టా అభివృద్ధి పేరుతో నీటిని తెలంగాణకు అందించాం అన్నారు. గోదావరి నదిపై గుత్ప, ఆలీసాగర్, దేవాదుల ఎత్తిపోతల చేపట్టామని, ఏపీలో చెగలానాడు, పుష్కర, తాటిపూడి, పట్టిసీమ ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు.

ప్రపంచంలో తక్కువ నీటి వినియోగం చేస్తున్న దేశం భారత దేశం అని..అందుకే గంగా కావేరి కలవాలని దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలన్నదే నా అభిష్టం అని స్పష్టం చేశారు. ఏపీలోని నదులన్ని కూడా అనుసంధానం చేయాల్సి ఉందన్నారు.

ఇవి కూడా చదవండి :

Gold And Silver Price Today : మళ్లీ పైకి లేచిన బంగారం, వెండి ధరలు
Polavaram Nallamala Sagar Project : పోలవరం – నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కీలక సూచన