• Telugu News
  • /Trending

Valentines Day | నిమిషానికి 1,042 ఆర్డ‌ర్లు.. వాలెంటైన్స్‌డే రోజున ఏవి ఎక్కువ ఆర్డ‌ర్ వ‌చ్చాయో తెలుసా..?

వాలెంటైన్స్ డే (Valentines Day) రోజున క్విక్ ఈ కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో భారీగా ఆర్డ‌ర్స్ వ‌చ్చాయి. చాక్లెట్లు (Chocolates), గులాబీలు, గిఫ్ట్ హ్యాంపర్లు, టెడ్డీలు ఎక్కువగా ఆర్డర్ వ‌చ్చాయి. ఈ ఆర్డ‌ర్స్‌లో చాక్లెట్‌లు ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో (Swiggy Instamart) నిమిషానికి 1,042 చాక్లెట్ ఆర్డ‌ర్‌లు వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

Reported by: Tejaswini Nanna | ట్రెండింగ్ | Feb 17, 2026, 6:46 am IST
Read Time: 5 mins
Valentines Day | నిమిషానికి 1,042 ఆర్డ‌ర్లు.. వాలెంటైన్స్‌డే రోజున ఏవి ఎక్కువ ఆర్డ‌ర్ వ‌చ్చాయో తెలుసా..?

Valentines Day | ఫిబ్ర‌వ‌రి 14 వాలెంటైన్స్ డే (Valentines Day) ముగిసింది. దాదాపు వారం రోజులుగా సాగిన ఈ వాలెంటైన్స్ డే వీక్‌ని ప్రేమికులు గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ప‌లు ర‌కాల వ‌స్తువుల‌ను గిఫ్ట్స్‌గా (Valentines Day Gifts) ఇచ్చి పుచ్చుకున్నారు. సాధార‌ణంగా ప్రేమికుల రోజు అంటే గుర్తొచ్చేది చాక్లెటే (Chocolates) క‌ద‌. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు ఒకరికొకరు చాక్లెట్లు బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఈసారి కూడా అదే జ‌రిగింది. ఈ ఏడాది భారతీయులకు చాక్లెట్లపై ఉన్న ఇష్టం సరికొత్త స్థాయికి చేరుకుంది.

చాక్లెట్‌ది ఫ‌స్ట్ ప్లేస్‌..

వాలెంటైన్స్ డే రోజున ప‌లు ఆన్‌లైన్ పోర్ట‌ల్స్‌లో లెక్క‌లేన‌న్ని ఆర్డ‌ర్స్ వ‌చ్చాయి. భారతదేశంలో క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చాక్లెట్లు, గులాబీలు, గిఫ్ట్ హ్యాంపర్లు, టెడ్డీలు ఎక్కువగా ఆర్డర్ వ‌చ్చాయి. ఈ ఆర్డ‌ర్స్‌లో చాక్లెట్‌లు ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాయి. ప్రేమికుల రోజున క్విక్ కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో (Swiggy Instamart) నిమిషానికి 1,042 చాక్లెట్ ఆర్డ‌ర్‌లు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. సిల్కీ డార్క్ బైట్స్ మొద‌లుకొని ఫ్రూటీ బైట్స్ వ‌ర‌కూ చాక్లెట్లు ప్రేమికుల హృద‌యాల‌ను గెలుచుకున్నాయి. చాలా మంది హార్ట్-షేప్ చాక్లెట్ల కోసం విప‌రీతంగా సెర్చ్ చేసిన‌ట్లు తేలింది.

ఒక్క‌రే రూ.25 వేల విలువైన‌ ఆర్డ‌ర్లు..

బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నైలో అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయి. మ‌రో విశేషం ఏంటంటే.. ఒకే వ్యక్తి ఏకంగా రూ.25,000 కంటే ఎక్కువ విలువైన బహుమతులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయ‌డం. కోల్‌క‌తాకు చెందిన ఓ క‌స్ట‌మ‌ర్ డార్క్ చాక్లెట్లు, మిల్క్ చాక్లెట్లు, గిఫ్ట్ బాక్సుల కోసం ఏకంగా 25 వేల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. హైద‌రాబాద్‌, ఢిల్లీ న‌గ‌రాలు కూడా తక్కువేమీ కాదు. ఈ రెండు న‌గ‌రాల్లో కూడా బ‌ల్క్ ఆర్డ‌ర్లు, కాస్ట్లీ గిఫ్ట్స్‌ను వినియోగ‌దారులు భారీగా ఆర్డ‌ర్ ప్లేస్ చేశారు.

గ‌తేడాది కూడా వాలెంటైన్స్ డే రోజున చాక్లెట్స్ ఆర్డ‌ర్సే ఎక్కువ వ‌చ్చాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ‌తేడాది వాలెంటైన్స్‌డే రోజున నిమిషానికి 581 చాక్లెట్ ఆర్డ‌ర్స్ వ‌చ్చాయి. అయితే, ఈ సారి ఆ సంఖ్య డ‌బుల్ అయ్యింది. దీంతో చాక్లెట్లు వాలెంటైన్స్ డే బ‌హుమ‌తుల్లో టాప్ ప్లేస్‌లో నిలిచాయి.

ఇవి కూడా చదవండి :

Kraken Myth | ‘క్రాకెన్‌’ నిజమేనా? సముద్రగర్భాన జలరాకాసి ఉందా?
Women Sell Her Husband For Rs. 1.5 Crores | శుభలగ్నం సీన్ రిపీట్.. భర్తను రూ.1.5 కోట్లకు అమ్మేసిన భార్య