Kraken Myth | ‘క్రాకెన్’ నిజమేనా? సముద్రగర్భాన జలరాకాసి ఉందా?
జెయింట్ స్క్విడ్‌ల విషయంలో ఇంకా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి సంతానోత్పత్తి ఎలా చేస్తాయి? ఎక్కడకు వెళతాయి? ఎంతకాలం జీవిస్తాయి? అన్న విషయాల్లో ఇంకా క్లారిటీ లేదు. నిజానికి సముద్రపు అడుగు భాగంలో దాదాపు 80 శాతం ఇంకా పూర్తిగా మ్యాపింగ్ చేయలేదు. అంటే.. ఈ అశేష సముద్రజల నిధిలో మనకు తెలిసిందే గోరంతే. తెలియాల్సింది ఇంకా కొండంత
Kraken Myth | క్రాకెన్! పూర్వకాలంలో సముద్ర యాత్రికులను భయపెట్టిన ఒక జలరాకాసి! ఫలానా చోటుకు వెళితే ఓ భారీ రాకాసి నౌకల్ని ముంచేస్తుంది.. అని సముద్ర పటాలపై రాసి ఉండేది. చాలా కాలంగా ఈ క్రాకెన్ కూడా డ్రాగన్ తరహాలో జానపద కథల్లో పాత్రే అనుకున్నారు. కానీ.. అది కథ కాదని, నిజంగానే అలాంటి భారీ రాకాసి సముద్ర గర్భంలో ఉందని వెల్లడైంది. పూర్వకాలంలో నావికులు పిలుచుకున్న ఆ రాక్షసి పేరు.. జెయింట్ స్క్విడ్. శాస్త్రీయ నామం.. Architeuthis dux.
13వ శతాబ్దపు నార్స్ పురాణాల్లో దీని ప్రస్తావనలు ఉంటాయి. భారీ టెంటాకిల్స్ ఉంటాయని, వాటితో పెద్ద పెద్ద నౌకలను సైతం చుట్టేసి.. లాగేసే శక్తిని కలిగి ఉండేదని కథలు ఉండేవి. సముద్రం లోతుల్లో అది దాగి ఉంటుందని రాశారు. అప్పటికీ దానిని చాలా మంది కల్పిత కథలే అనుకున్నారు. కానీ.. 1857లో కథ రివర్స్ అయింది. డెన్మార్క్‌కు చెందిన ప్రకృతి శాస్త్రవేత్త Japetus Steenstrup మొదటిసారి Architeuthis dux అనే నిజమైన జాతిని గుర్తించారు. అది పురాణ కథల్లో చెప్పిన లక్షణాలకు దాదాపు సరిపోలింది. ఆ తర్వాత 2004 తర్వాత మరోసారి ప్రపంచం జెయింట్ స్క్విడ్‌వైపు దృష్టిసారించింది. నిజానికి అప్పటి వరకూ ఎవరూ ఈ జీవిని సహజవాతావరణంలో చూడలేదు. కానీ.. 2004లో మొదటిసారి జపాన్ శాస్త్రవేత్తలు ఒగాసావారా దీవుల సమీపంలో సజీవ జెయింట్ స్క్విడ్ ఫొటోలు తీశారు. వాటికి సుమారు 5.5 మీటర్ల పొడవు ఉన్న టెంటాకిల్స్‌ను పరీక్షించగా.. అది Architeuthis duxకే చెందినదని రుజువైంది. అదికూడా.. 99.7శాతం డీఎన్‌ఏ పోలికతో! ఇక 2012లో మరో సంచలనం బయటకు వచ్చింది. జెయింట్ స్క్విడ్ మొట్టమొదటి వీడియో వెలుగు చూసింది. బంగారు రంగు కాంతితో మెరిసిపోయే ఆ భారీ జీవి.. సముద్ర లోతుల్లు ఈదుతూ కనిపించింది. క్రాకెన్ నిజమే అన్న నమ్మకం.. ఆ వీడియోతో బలపడింది.

భారీ కాయాల జీవులన్నీ సముద్రం అట్టడుగునే ఎందుకు ఉంటాయి?
సముద్రగర్భంలోని లోతైన ప్రాంతాన్ని జెయింట్స్ ఫ్యాక్టరీ అని పిలుస్తుంటారు. అంటే.. అదొక ఎవల్యూషన్ ఐలాండ్ అన్నమాట. సముద్ర గర్భం లోతుల్లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కటిక చీకటి. చిన్న, మధ్యస్థ జీవులు బతకలేని స్థితి కారణంగా ఆహార కొరత అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా కనిష్ఠంగా ఉంటుంది. ఈ పరిస్థితులే భారీ కాయాలతో ఉండే సముద్రజీవులకు కలిసివచ్చేవి. పెద్ద శరీరాలతో ఉండే జీవులు శక్తిని ఆదా చేస్తాయి. ఎక్కువ ఆక్సిజన్‌ను నిల్వ చేసుకుంటాయి. పెను ఒత్తిడిని సైతం తట్టుకోగలవు. దీనినే గిగాంటిజమ్ అని శాస్త్రవేత్తలు పిలుస్తారు. ‘లోతైన సముద్రం ప్రకృతిలోని అతిపెద్ద లాబొరేటరీ. ఇక్కడ పరిమాణాల నియమాలు మారిపోతాయి’ అని పరిశోధకుడు క్రెగ్ ఆర్ మెక్‌క్లైన్ అంటారు.
జెయింట్ స్క్విడ్ ఎంత పరిమాణంలో ఉంటుంది?
ఇదే అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం. పదమూడు మీటర్లకుపైగానే పొడవుతో జెయింట్ స్క్విడ్స్ ఉంటాయి. జంతు ప్రపంచంలోనే అత్యంత పెద్ద కళ్లు వీటి ప్రత్యేకత. చిమ్మచీకటిలో కూడా కాంతిని గుర్తించగల శక్తిని అవి కలిగి ఉంటాయి. వీటి ప్రధాన శత్రువు స్పెర్మ్ తిమింగలం. తిమింగలాల శరీరాలపై కనిపించే గాట్లు, తిమిగలాల పొట్టలో లభ్యమైన స్వ్కిడ్ అవశేషాలు ఈ రెండు భారీ జీవుల మధ్య జీవన్మరణ యుద్ధాలకు సాక్ష్యాలుగా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు.
జెయింట్ స్క్విడ్‌ల విషయంలో ఇంకా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి సంతానోత్పత్తి ఎలా చేస్తాయి? ఎక్కడకు వెళతాయి? ఎంతకాలం జీవిస్తాయి? అన్న విషయాల్లో ఇంకా క్లారిటీ లేదు. నిజానికి సముద్రపు అడుగు భాగంలో దాదాపు 80 శాతం ఇంకా పూర్తిగా మ్యాపింగ్ చేయలేదు. అంటే.. ఈ అశేష సముద్రజల నిధిలో మనకు తెలిసిందే గోరంతే. తెలియాల్సింది ఇంకా కొండంత ఉంది. కానీ.. కొండత జీవుల అతిపెద్ద టెంటాకిల్స్ గురించి పూర్వకాలంలో నావికులు, సముద్ర యాత్రికులు చెప్పిన కథలు.. అతిశయోక్తి కాదని, అప్పుడు వాళ్లు గుర్తించినది.. ఈ జెయింట్ స్క్విడ్‌నే అయి ఉంటుందని భావిస్తున్నారు. పురాణ కథలంటే.. సైన్స్ ఇంకా అర్థం చేసుకోని డాటా మాత్రమే అనేందుకు జెయింట్ స్క్విడ్ ఉదంతం ఒక నిదర్శమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తానికి క్రాకెన్ కథ.. భయంతో మొదలై.. శాస్త్రీయ సత్యంగా తేలింది. అంతులేని ఈ అగాధ జలనిధి.. ఇంకెన్ని విశేషాలను నింపుకొన్నదో.. ఆ విశేషాలు ఇంకెంత కాలానికి బయటపడతాయో!
“What were once monsters to be feared are now curious and magnificent creatures that delight. We like to feel that science and exploration has brought about this change.”
Read the story of how scientists captured a giant squid on video: https://t.co/RUu2YkCDFS pic.twitter.com/J2ERl10blz
— NOAA Research (@NOAAResearch) June 21, 2019
Read Also |
తెలంగాణలోని 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
Paddy Bonus 2026 | రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. బోనస్ రూ.514.36కోట్లు విడుదల
Vijay – Rashmika | ఇట్స్ అఫీషియల్.. విజయ్–రష్మిక పెళ్లికి టైం ఫిక్స్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ .
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram