తెలంగాణలోని 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే

తెలంగాణలో 7 కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు పూర్తయ్యాయి. 5 చోట్ల కాంగ్రెస్ విజయం, ఇతర పార్టీల సత్తా చాటింది.

తెలంగాణలోని 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే

విధాత, హైదరాబాద్ : తెలంగాణలోని 7 కార్పోరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఏడింటిలో 5 కార్పోరేషన్ల మేయర్ పదవులను కాంగ్రెస్ హస్తగతం చేసుకుని సత్తా చాటింది. కరీంనగర్, నిజమాబాద్ లలో మేయర్ పదవుల కోసం బీజేపీతో పోటీ పడిన కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ లో మాత్రం ఎంఐఎం సహకారంతో విజయవంతమైంది. కొత్తగూడెంలో ఒప్పందం మేరకు మిత్ర పక్షం సీపీఐకి మేయర్ పదవి ( తొలి రెండున్నరేళ్లు) ఇచ్చేసి..డిప్యూటీ మేయర్ పదవితో సరిపెట్టుకుంది.

ఏడు కార్పోరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల వివరాలు

1.కరీంనగర్ కార్పొరేషన్ : మేయర్ – కొలగాని శ్రీనివాస్ (బీజేపీ), డిప్యూటీ మేయర్ – సునీల్ రావు (బీజేపీ)

2. నిజామాబాద్ కార్పొరేషన్ : మేయర్ – ఉమారాణి (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్ – సల్మా తహసీన్ (ఎంఐఎం)

3. రామగుండం కార్పొరేషన్ : మేయర్ – మహంకాళి స్వామి (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్ – పాతిపెల్లి ఎల్లయ్య (కాంగ్రెస్)

4. కొత్తగూడెం కార్పొరేషన్ : మేయర్ – మూడ్ గణేశ్ (సీపీఐ), డిప్యూటీ మేయర్ – సిరిపురపు లలిత కుమారీ (కాంగ్రెస్)

5. నల్గొండ కార్పొరేషన్ : మేయర్ – బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్ – మహమ్మద్ అష్రఫ్ అలీ(ఎంఐఎం)

6. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ : మేయర్ – గుమల్ మమత (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్ – సురేందర్ రెడ్డి (కాంగ్రెస్)

7. మంచిర్యాల కార్పొరేషన్ : మేయర్ – ధర్ని మధుకర్ (కాంగ్రెస్), డిప్యూటీ మేయర్ – రమ్య మహేశ్ (కాంగ్రెస్)

ఇవి కూడా చదవండి :

Nalgonda : నల్లగొండ తొలి మేయర్ గా బుర్రి చైతన్య ఏకగ్రీవ ఎన్నిక
Crocodile Attack : మహిళను చంపేసిన మొసలి..వీడియో వైరల్