Nalgonda : నల్లగొండ తొలి మేయర్ గా బుర్రి చైతన్య ఏకగ్రీవ ఎన్నిక
నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బుర్రి చైతన్య ఏకగ్రీవ ఎన్నిక. కాంగ్రెస్ ఆధిక్యం, జిల్లాల్లో మున్సిపాల్టీల ఫలితాలు వెల్లడి.
విధాత : నల్లగొండ కార్పోరేషన్ తొలి మేయర్ గా కాంగ్రెస్ అభ్యర్తి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైంది. నల్లగొండ నగర పాలక సంస్థలో 48 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 27 డివిజన్లలో విజయం సాధించింది. సోమవారం నిర్వహించిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో మేయర్‌గా బుర్రి చైతన్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం మేయర్‌గా బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్‌గా అష్రాఫ్ అలీ ప్రమాణం చేశారు. ఆలిండియా ఫార్వర్డ్ పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. దీంతో మొత్తం 30మంది సభ్యులు అయ్యారు. ఎక్స్ అఫీషియో మెంబర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నల్లగొండ జిల్లా మున్సిపాల్టీలు హస్తగతం
1. మిర్యాలగూడ మున్సిపాల్టీ : చైర్మన్ “చిలుకూరు సుధ” & వైస్ చైర్మన్ “శిరీష”
2 .చిట్యాల మున్సిపాల్టీ : చైర్మన్ “పందిరి గీత” & వైస్ చైర్మన్ “గుండెబోయిన శ్రీలక్ష్మి”
3.దేవరకొండ మున్సిపాల్టీ : చైర్మన్ “పున్న శైలజ” & “జూబేరియా తబసుం”
4.చండూరు మున్సిపాల్టీ : చైర్మన్”కోడి శ్రీనివాసులు” & వైస్ చైర్మన్ ” బూతరాజు దశరథ”
5 హాలియా మున్సిపాల్టీ : చైర్మన్ “చింతల రామచంద్రారెడ్డి” & వైస్ చైర్మన్”రాజా రమేష్”
6. నందికొండ: చైర్మన్ “గౌతమి” & వైస్ చైర్మన్ “రాజా ప్రసాద్”
సూర్యాపేట జిల్లాలో..
1.సూర్యాపేట మున్సిపాల్టీ : “మొరిశెట్టి నివేదిత” & వైస్ చైర్మన్ ఎండీ.షఫీఉల్లా”
2.కోదాడ మున్సిపాల్టీ : చైర్మన్ “వెర్నేని కుసుమ వెంకటరత్నం” & వైస్ చైర్మన్ “దేవరపల్లి మల్లీశ్వరి”
3. హుజూర్నగర్ మున్సిపాల్టీ : చైర్మన్ “దొంతగాని శ్రీనివాస్ గౌడ్” & వైస్ చైర్మన్ “తన్నీరు మల్లిఖార్జున్”
4.నేరెడుచర్ల మున్సిపాల్టీ : చైర్మన్ “కొణతం చిన వెంకట్ రెడ్డి” & వైస్ చైర్మన్ “నూకల సందీప్ రెడ్డి”
5.తిరుమలగిరి మున్సిపాల్టీ : (BRS) చైర్మన్: S.రఘునందన్ రెడ్డి” & వైస్ చైర్మన్: “గోవిందమ్మ”
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
1.భువనగిరి మున్సిపాల్టీ : చైర్మన్ “తంగళ్ళపల్లి శ్రీవాణి” & వైస్ చైర్మన్ “పోతంశెట్టి మంజుల”
2.యాదగిరిగుట్ట మున్సిపాల్టీ : చైర్మన్ “గుండ్లపల్లి భరత్ గౌడ్” & వైస్ చైర్మన్ “బరిగే రమ్య”
3.చౌటుప్పల్ మున్సిపాల్టీ : చైర్మన్ “మోగుదాల పావని రమేశ్ గౌడ్” & వైస్ చైర్మన్ “గోశిక వినయ్”..
4.భూదాన్ పోచంపల్లి మున్సిపాల్టీ : చైర్మన్ “తడక వెంకటేషo” & వైస్ చైర్మన్ గా “కొయ్యడ రజిని
5.ఆలేరు మున్సిపాల్టీ : చైర్మన్ “బాలామణి” & “ఇంగడి ఆంజనేయులు”
6.మోత్కూరు మున్సిపాల్టీ : చైర్మన్”గడ్డం స్వప్న” & వైస్ చైర్మన్”పల్లెర్ల వెంకన్న”.
ఇవి కూడా చదవండి :
తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక వాయిదా!
Trisha Krishnan : తమిళనాడు బీజేపీ చీఫ్ వ్యాఖ్యలపై నటి త్రిష ఫైర్ !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram