Tripod Fish| చేపకు మూడు కాళ్లు..త్రిపాద చేప వీడియో వైరల్

సముద్ర జలాల్లో చేపల రకాలు ఆసక్తి గొల్పుతు ఉంటాయి. సముద్రం లోతుకు వెళ్లే కొద్ది చేపలు, జీవరాశుల రకాలు వింతలు విశేషాలతో ఆకట్టుకుంటుంటాయి. సముద్రపు లోతు జలాల్లో నివసించే ఓ చేప శరీర నిర్మాణం రెక్కలతో పాటు మూడు కాళ్లను కలిగి ఉండటం విశేషం. త్రిపాద చేప(త్రిపాద స్పైడర్ ఫిష్) గా పిలిచే దీని శాస్త్రీయ నామం బాతిప్టెరాయిస్ గ్రాలేటర్.

Tripod Fish| చేపకు మూడు కాళ్లు..త్రిపాద చేప వీడియో వైరల్

విధాత : సముద్ర జలాల్లో చేపల రకాలు ఆసక్తి గొల్పుతు ఉంటాయి. సముద్రం లోతుకు వెళ్లే కొద్ది చేపలు, జీవరాశుల రకాలు వింతలు విశేషాలతో ఆకట్టుకుంటుంటాయి. సముద్రపు లోతు జలాల్లో నివసించే ఓ చేప శరీర నిర్మాణం రెక్కలతో పాటు మూడు కాళ్ల(Tripod Fish)ను కలిగి ఉండటం విశేషం. అది సముద్రం అడుగున కాళ్లమీద నిలబడినట్లుగా ఉండి..ఆహార వేట కోసం ప్రయత్నిస్తూ కనిపిస్తున్న వీడియో వైరల్ గా మారింది. త్రిపాద చేప(త్రిపాద స్పైడర్ ఫిష్ TripodSpider Fish) గా పిలిచే దీని శాస్త్రీయ నామం బాతిప్టెరాయిస్ గ్రాలేటర్(Bathypterois grallator). సముద్రంలో నిలబడి ఉన్న త్రిపాద చేప (బాథిప్టెరోయిస్ గ్రాలేటర్) 1,000–4,800 మీటర్ల లోతులో ఎరను ఆకస్మికంగా దాడి చేయడానికి తన మూడు కాళ్లపై నిలబడి ఎగరడానికి సిద్దమైన వీడియో నెటిజన్లను అశ్చర్య పరుస్తుంది.

దాదాపు 43సెంటిమీటర్ల పొడవు పెరిగే గ్రాలెటర్ చేప వెండి వర్ణంలో తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది. ఇది ఎక్కువగా అట్లాంటిక్ , హిందూ మహాసముద్రాలలో, ఉత్తర, మధ్య అమెరికా, మడగాస్కర్ తీర ప్రాంతాలలో లోతైన సముద్ర ప్రదేశాల్లో నివసిస్తుంటుంది. 2,881 నుండి 15,486 అడుగుల లోతు(878 నుండి 4800 మీటర్లు)లో, 2.7 నుండి 13.5 డిగ్రీల సెల్సియస్ నీటీ ఉష్ణోగ్రతలలో సంచరిస్తుంటుంది. త్రిపాద ఆకృతిలో ఉండే దాని శరీర నిర్మాణం నీటిలో చేప ఈదేందుకు, వేటాడే ఎర కొసం నిలబడేందుకు అనువుగా ఉండటంతో అది నీటి అడుగులో ఎక్కువగా ఉంటుంది. చేప మొప్పల నుంచి కిందుగా, తోక భాగాన 30 సెం.మీ పొడవుతో ఉండే కాళ్ల వంటి శరీర నిర్మాణం దాని మనుగడకు ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి..

Samantha Wedding Ring | సమంత పెళ్లి ఉంగ‌రం అంత కాస్ట్‌లీనా.. రింగ్ వెన‌క హిస్ట‌రీ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!
Sarpanch Elections| అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ గా పోటీ
Bird Eats Snake| తన పొడవు పామును మింగేసిన కొంగ..వీడియో వైరల్