Samantha Wedding Ring | సమంత పెళ్లి ఉంగరం అంత కాస్ట్‌లీనా.. రింగ్ వెనక హిస్టరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Samantha Wedding Ring | టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెండో వివాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరును ఆమె సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా ఆశ్రమంలో వివాహం చేసుకున్నారు.
Samantha Wedding Ring | టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెండో వివాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరును ఆమె సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా ఆశ్రమంలో వివాహం చేసుకున్నారు. ఇరువురు కుటుంబాల నుంచి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ వేడుక పూర్తిగా ప్రైవేట్‌గా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. అనంతరం సమంత తన రెండో వివాహాన్ని అధికారికంగా ప్రకటించడంతో, పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రాజ్ ఇచ్చిన ప్రత్యేక ఉంగరం…
ఈ వివాహంలో అందరి దృష్టిని ఆకర్షించింది సమంతకు రాజ్ తొడిగిన ప్రత్యేక ఉంగరం. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఈ రింగ్‌ను రాజ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించాడని తెలుస్తోంది. ఉంగరం రూపకల్పనలో నాలుగు మూలాలకూ ప్రత్యేకమైన అర్ధాలు దాగి ఉన్నాయి.
మొదటి మూల: స్పష్టత, నిజాయితీ, నిష్కాపట్యత
రెండవ మూల: బలం, స్థితిస్థాపకతపై నిర్మించిన సంబంధం
మూడవ మూల: శాశ్వత బంధం, జీవన ధోరణులు
నాలుగో మూల: సమయాన్ని భరించే ప్రేమ, నిబద్ధత
ప్రత్యేక డైమండ్స్, పచ్చ రత్నాలతో చేసిన ఈ ఉంగరం, సమంత పట్ల తన ప్రేమను ప్రతిఫలించేలా రాజ్ రూపొందించాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
‘భూత శుద్ధి వివాహం’… దాంపత్య బంధానికి ఆధ్యాత్మిక శక్తి
సమంత–రాజ్ తమ వివాహాన్ని సాధారణ రీతిలో కాకుండా, అత్యంత శక్తివంతమైన ‘భూత శుద్ధి వివాహం’ అనే యోగ సంప్రదాయం ప్రకారం జరిపారు. ఈ పద్దతి ప్రకారం, దాంపత్య బంధం ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా లోతైన స్థాయిలో కలుస్తుందని ఆధ్యాత్మిక గురువులు విశ్వసిస్తారు. దంపతుల దేహంలోని పంచభూతాలను శుద్ధి చేసే ఈ క్రతువు, భవిష్యత్ జీవనంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత పెరిగేలా చేస్తుందని భావిస్తారు.
లింగ భైరవి దేవాలయం వంటి ఎంపిక చేసిన ప్రత్యేక స్థలాల్లో మాత్రమే నిర్వహించే ఈ వివాహ పద్దతి, ఈశా సంస్కృతి ప్రత్యేకతను కలిగి ఉంటుంది. సమంతకు ఇది రెండో వివాహమే కాకుండా, దర్శకుడు రాజ్ జీవితంలో కూడా ఇది రెండో పెళ్లి కావడంతో, ఈ బంధం మరింత బలపడాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక సంప్రదాయాన్ని ఎంచుకున్నారని సమాచారం.
ఫ్యాన్స్ రియాక్షన్స్
సమంత రెండో పెళ్లి వార్త బయటకు రావడం వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ కురిపించారు. పెళ్లి ఫోటోలు, రింగ్ స్పెషల్ డిజైన్, ఆధ్యాత్మిక వివాహ పద్దతిపై చర్చలు కొనసాగుతున్నాయి. సమంత-రాజ్ నిడిమోరు వివాహం ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram