Vijay – Rashmika | ఇట్స్ అఫీషియల్.. విజయ్–రష్మిక పెళ్లికి టైం ఫిక్స్.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ .
Vijay - Rashmika | టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, కలిసి డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వినిపించగా… ఇటీవల సైలెంట్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
Vijay – Rashmika | టాలీవుడ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న పెళ్లి వార్తలకు తాజాగా మరింత ఊతమిచ్చే పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వీరి పేర్లతో కూడిన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ వైరల్ కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వివాహం, మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు కార్డ్‌లో పేర్కొనబడినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
ప్రేమ నుంచి పెళ్లి వరకూ ప్రయాణం
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల సమయంలోనే వీరి మధ్య స్నేహం మొదలై ప్రేమగా మారిందనే వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. పబ్లిక్‌గా “మేము మంచి స్నేహితులమే” అని చెప్పుకొచ్చినా, ఒకే లొకేషన్లలో కనిపించడం, విదేశీ ట్రిప్స్ ఫోటోలు, ఎయిర్‌పోర్ట్ దర్శనాలు అభిమానుల్లో అనుమానాలకు దారి తీశాయి.
గతేడాది దసరా సమయంలోనే నిశ్చితార్థం జరిగిందన్న ప్రచారమూ వచ్చింది. అయితే దానిపై కూడా స్పష్టత రాలేదు. ఇప్పుడు వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ ఆ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది.
ఉదయ్‌పూర్‌లో రాయల్ వెడ్డింగ్?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కార్డు ప్రకారం ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సింపుల్‌గా వివాహం జరగనుందట. ఈ వేడుకను గోప్యంగా ఉంచాలని జంట భావించినప్పటికీ సమాచారం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
మార్చి 4న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో సాయంత్రం 7 గంటల నుంచి రిసెప్షన్ నిర్వహించనున్నట్లు ప్రచారం. ఈ వేడుకకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారన్న సమాచారం వినిపిస్తోంది.
అధికారిక ప్రకటన ఎప్పుడూ?
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజయ్ కలవడం కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. ఆహ్వాన పత్రిక ఇవ్వడానికే ఆ భేటీ జరిగిందా? అన్న చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
ఇంకా ఒక ఆసక్తికర అంశం ఏమిటంటే, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ‘రణబాలి’ చిత్రంలో ఈ జంట మళ్లీ కలిసి నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత వచ్చే తొలి సినిమా ఇదే కావొచ్చన్న టాక్ కూడా నడుస్తోంది.
ఇప్పటివరకు ఈ పెళ్లి విషయంపై విజయ్ లేదా రష్మిక అధికారిక ప్రకటన చేయకపోయినా… వెడ్డింగ్ కార్డ్ వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సోషల్ మీడియాలో ఇప్పటికే “ఫోటోలు ఎప్పుడు వస్తాయి?”, “అధికారిక ప్రకటన ఎప్పుడు?” అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి ఈ జంట పెళ్లి వార్త నిజమా? లేక కేవలం రూమరేనా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం విజయ్–రష్మికల వివాహం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram